»   » చరణ్-సుకుమార్ మూవీ: రావు రమేష్‌ను తప్పించారా?

చరణ్-సుకుమార్ మూవీ: రావు రమేష్‌ను తప్పించారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ సమంత తండ్రిగా నటిస్తున్న ప్రముఖ నటుడు రావు రమేష్ ఉన్నట్టుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో ప్రకాష్ రాజ్ ను తీసుకుంటున్నట్లు టాక్.

సినిమా సగం షూటింగ్ అయిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. దర్శకుడితో విబేధాల కారణంగానే రావు రమేష్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

అయితే ఇద్దరి మధ్య ఏ విషయంలో విబేధాలు వచ్చాయో? తెలియదు కానీ ఈ విషయం ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా ఫేమస్ అయిన, ఎలాంటి క్యారెక్టర్ అయినా పెర్ఫెక్టుగా చేయగలిగే రావు రమేష్..... తీరు సుకుమార్ కు నచ్చలేదా? ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? తెలియాల్సి ఉంది.

మళ్లీ రీ షూట్

మళ్లీ రీ షూట్

రావు రమేష్ మీద ఇప్పటికే కొన్నీ సీన్లు తీసారని, అయితే ఆ సీన్లను ప్రకాష్ రాజ్ తో మళ్లీ రీ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతకు ఇది అదనపు భారమే అని అంటున్నారు.

గతంలో కూడా ఇలానే...

గతంలో కూడా ఇలానే...

రామ్ చరణ్ గతంలో నటించిన ‘గోవిందుడు అందరి వాడే' విషయంలో కూడా ఇలానే జరిగింది. ఇందులో మొదట తమిళ నటుడు రాజ్ కిరణ్ ను తీసుకోగా ఆయన్ను తప్పించి ప్రకాష్ రాజ్ తో ఆ పాత్ర చేయించిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్-సుకుమార్

రామ్ చరణ్-సుకుమార్

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. దర్శకుడిగా సుకుమార్ కు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు బావున్నాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
According to the latest update, actor Rao Ramesh has been walked out from Ram Charan’s upcoming untitled movie #RC11, being helmed by Sukumar. The reason behind it is the differences between director Sukumar and actor Rao Ramesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X