»   » ఆమెతో ఒకసారి చేస్తే ...మళ్లీ మళ్లీ కావాలంటున్నారు

ఆమెతో ఒకసారి చేస్తే ...మళ్లీ మళ్లీ కావాలంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక సినిమాలో జంటగా చేసిన హీరో,హీరోయిన్స్ మరో సినిమాలో కంటిన్యూ అవ్వాలంటే వారి మధ్య మంచి ర్యాపో ఉండాలి. ముఖ్యంగా హీరోలు తమ ప్రక్కన ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ ని కోరుకుంటూంటారు. ఒక సారి చేసిన వారిని రిపీట్ చేయటానికి ఆసక్తి చూపించారు.

కానీ అదేంటో రాశిఖన్నా మాత్రం ఒకసారి ఆమెతో చేస్తే ఆ హీరోలు తమ నెక్ట్స్ ప్రాజెక్టులో ఆమెనే కావాలంటూంటారు. జిల్ లో గోపీచంద్ తో చేసిన ఆమెను తన తదుపరి చిత్రం ఆక్సిజన్ లో తీసుకున్నాడు గోపిచంద్. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అంతేనా...


‘బెంగాల్‌ టైగర్‌'లో రవితేజకు జంటగా చేసింది రాశీఖన్నా. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి తెరపై సందడి చేయబోతున్నారు. రవితేజ హీరోగా రంజిత్‌ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. దామోదర ప్రసాద్‌ నిర్మాత. చక్రి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

‘రాబిన్‌ హుడ్‌' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. మార్చి నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. హీరోయిన్ గా రాశీ ఖన్నాని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ సాగుతున్నాయి. వారం రోజుల్లో మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Rashi Khanna again to romance Ravi Teja


కిక్ 2 సినిమాలో రవితేజ క్యారెక్టర్ పేరు రాబిన్ హుడ్. ఇప్పుడు ఇదే పేరును తన నెక్ట్స్ సినిమాకు టైటిల్ గా ఫైనల్ చేశాడు రవితేజ. చక్రి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ఈ టైటిల్ ..సినిమాకు కిక్ ఇచ్చిందని అభిమానులు అంటున్నారు.

బెంగాల్ టైగర్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన రవితేజ వేణు శ్రీరామ్ తో అనుకున్న 'ఎవడో ఒకడు' సినిమా ఆగిపోయింది. దిల్ రాజు తో కథా విషయంలో సెట్ కాకే ప్రాజెక్టు ప్రారంభమై ఫస్ట్ షెడ్యూల్ లోనే ఫుల్ స్టాప్ పెట్టేసారు. దాంతో వెంటనే మరో ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించాలని రవితేజ ఇలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాతో పాటు మరో సినిమాలోనూ నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినరని వినపడుతోంది. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్‌తో కలసి వర్క్ చేసేందుకు రవితేజ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో చిత్రం రాబోతోంది. ఆ రెండు చిత్రాలతో రవితేజ నటన కచ్చితంగా అభిమానుల్ని ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

English summary
Rashi Khanna is being considered opposite Mass Maharaja Ravi Teja for his next. Ravi Teja is all set to begin a new film for producer Damodara Prasad. The new movie has been titled Robin Hood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu