Don't Miss!
- Sports
INDvsAUS : భారత్‌తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సుడిగాలి సుధీర్ సరికొత్త అవతారం.. ఆమెతో రొమాన్స్.. రష్మీ ఫైర్?
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మొదటి సినిమాలో నటించిన హీరోయిన్ ధన్య బాలకృష్ణ నటనపై యాంకర్ రష్మీ ఫైర్ అయినట్లుగా ప్రముఖ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుధీర్‌తో ధన్య రొమాన్స్ అంతగా పండలేదని అంటున్నారు. వివరాల్లోకి పోతే..

సుడిగాలి సుధీర్ కొత్త అవతారం.. ఆమెతో జోడీ
బుల్లితెర కమెడియన్‌గా తనదైన మార్క్ చూపించిన సుడిగాలి సుధీర్ హీరో అవతారమెత్తి 'సాఫ్ట్‌వేర్ సుధీర్' అయ్యాడు. శేఖర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్ రాజు నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ నటించింది.

సుధీర్‌తో కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదా?
మొదటి సినిమా తోనే వెండితెరపై సుధీర్ పూర్తి స్థాయి హీరోగా మెప్పించాడని టాక్ వినిపిస్తోంది. కాకపోతే ఈ సినిమాలో అతడి సరసన హీరోయిన్‌గా నటించిన ధన్య బాలకృష్ణ మాత్రం ఆశించిన క్రెడిట్ దక్కించుకోలేదని టాక్. సుధీర్‌తో అంతగా కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదని కొందరంటున్నారు. గతంలో ధన్యకు కొన్ని వెబ్ సిరీస్ లలో నటించడంతో పాటు, హీరోయిన్ల పక్కన స్నేహితురాలి పాత్రల్లో నటించిన అనుభవముంది.

సుడిగాలి సుధీర్‌కి పర్ఫెక్ట్ జోడీ ఎవరంటే
నిజానికి సుడిగాలి సుధీర్‌కి పర్ఫెక్ట్ జోడీ ఎవరంటే రష్మీ అని ఎవ్వరైనా చెబుతారు. ఆ ఇద్దరి జోడీ అంతగా పాపులారిటీ తెచ్చుకుంది. అందుకేనేమో సుధీర్ పక్కన ఇంకెవ్వరినీ చూడటం ప్రేక్షకులను అంతగా నచ్చలేదు కాబోలు. ఏదేమైనా సుధీర్- ధన్య మాత్రం సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాతో కాస్త క్రేజ్ కొట్టేసినట్లే.

రష్మీ ఫైర్ అయిందా?
కాగా సుధీర్‌తో ధన్య కెమిస్ట్రీ వర్కవుట్ చూసి రష్మీ కాస్త ఫైర్ అయినట్లు నెట్టింట వార్తలు షికారు చేస్తున్నాయి. ధన్య బాలకృష్ణ ఈ సినిమా విషయంలో మరికాస్త శ్రద్ధ పెట్టిఉంటే బాగుండేదని ఆమె అంటున్నట్లు సమాచారం. సుడిగాలి సుధీర్ లాంచింగ్ సినిమాలో ఇలా అశ్రద్ధగా చేయడం తనకు నచ్చలేదని ఆమె ఫీల్ అవుతోందని టాక్ వినిపిస్తోంది.

సుధీర్‌తో రష్మీ చేసి ఉంటేనా..
మరోవైపు సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కూడా సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలో సుధీర్‌తో రష్మీ జోడీ కట్టి ఉంటే అదిరిపోయేదని అంటున్నారు. సో చూడాలి మరి నెక్స్ట్ సినిమాల్లో అయినా ఈ ఇద్దరు జోడీ కట్టి ప్రేక్షకుల కోరిక తీరుస్తారో! లేదో.. అనేది.