Rashmika Mandanna: రష్మిక మందన్న లేటెస్ట్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో కిర్రాక్ పార్టీ అనే చిత్రంతో తొలిసారిగా వెండితెరకు ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ చిత్రం 2016లో విడుదలైంది. ఇక రష్మిక మందన్న ఆల్మోస్ట్ చిత్ర పరిశ్రమలో దాదాపుగా 10 ఏళ్ల అనుభవాన్ని సాధించింది. ఈ దశాబ్ద కాలంలో రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా ఎదగడమే కాకుండా, దేశ వ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను, తనకంటూ ఫిల్మ్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంది.
ప్రస్తుతం రష్మిక మందన్న భారీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే రష్మిక మందన్న బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గుడ్ బై అనే చిత్రంతో కరోనా తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కేవలం 3 ఏళ్లలోనే బాలీవుడ్ లో రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా మారి వరుస ప్రాజెక్ట్స్ ను అందుకుంటోంది. ఇప్పటికే యానిమల్, ఛావా, సికిందర్ వంటి చిత్రాలతో భారీ విజయాన్ని సాధించింది. ఈ 3 ఏళ్లలో బాక్సాఫీస్ వద్ద రూ.2500 కోట్ల వరకు వసూళ్లు అందుకున్న హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది.

అయితే ఇంతటి సక్సెస్ రేట్ ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ రెమ్యునరేషన్ వివరాలు షాకింగ్ గా ఉన్నాయి. ఇండియాతో పాటు ఓవర్సీస్ లో దుమ్ములేపిన పుష్ప 2 చిత్రానికి దగ్గర దగ్గర రష్మిక మందన్న రూ.10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని రిపోర్ట్ లు తెలుపుతున్నాయి. కాగా బాలీవుడ్ లో తాజాగా నటిస్తున్న థామా అనే చిత్రానికి మాత్రం రష్మిక మందన్న అందులో సగం కూడా రెమ్యునరేషన్ గా పొందలేని బాలీవుడ్ సినీ నిపుణులు వెల్లడిస్తున్నారు.
హిందీ భాషలో రష్మిక మందన్న నుంచి థియేటర్లలోకి రాబోతున్న చిత్రం థామా. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు రష్మిక మందన్న కేవలం రూ.4 కోట్ల పారితోషికం మాత్రమే అందుకున్నారని తెలుస్తోంది. కాగా తాజాగా ఒక రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు. అది అచ్చు స్పెషల్ సాంగ్ లాగానే ఉంది. అంతలా గ్లామర్ ఒళకబోసి, మరోవైపు లీడ్ లో నటించినప్పటికీ రష్మిక మందన్న ఇంత తక్కువ పారితోషికం తీసుకోవడం ఏంటని చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం రష్మిక మందన్న తుమ్ మేరే నా హుయే సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక ఈ రొమాంటిక్ కామెడీ హార్రర్ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ భాషలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కాబోతోంది. నిర్మాతలు దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా మాడాక్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. మడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్‌లో ఇది 5వ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక దీపావళి కానుకగా 21 అక్టోబర్ 2025న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











