twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ సర్కార్ దెబ్బ.. రిలీజ్ డేట్ విషయంలో 'ఖిలాడీ'కి టెన్షన్.. మళ్ళీ వెనక్కు?

    |

    రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే

    గత ఏడాదే పూర్తయి

    గత ఏడాదే పూర్తయి

    చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.. ఆయన హీరోగా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర లాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఖిలాడీ సినిమా షూటింగ్ కూడా గత ఏడాదే పూర్తయింది. కానీ కరోనా కారణంగా దాన్ని విడుదల చేయడానికి మాత్రం సరైన డేట్ దొరకలేదు.

    రవితేజ ద్విపాత్రాభినయం

    రవితేజ ద్విపాత్రాభినయం

    రాక్షసుడు సినిమా తో సూపర్ హిట్ అందుకున్న రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఎ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, అర్జున్ సర్జా, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలకు దగ్గర సమయం దగ్గర పడటంతో సినిమా నుంచి వారికి సంబంధించిన అప్డేట్స్ ను నెమ్మదిగా విడుదల చేస్తూ వస్తున్నారు.

     నైట్ కర్ఫ్యూ

    నైట్ కర్ఫ్యూ

    నిజానికి ముందుగా ప్రకటించిన ప్రకటన మేరకు ఈ సినిమాని ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమాని మరో వారం పాటు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ జనవరి 31 తో పూర్తికాగా దానిని మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది.

    మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్

    మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్

    ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటే ఒక ఆటను తగ్గించుకోవాల్సి వచ్చే అవకాశాలు ఉండటంతో నిర్మాతలు సినిమాను వాయిదా వేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఫిబ్రవరి 18 వ తారీఖున ఖిలాడీ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల నుండి మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. దీంతో విడుదలకు ముందే గొప్ప పాజిటివ్ వైబ్‌లు కూడా ఏర్పడ్డాయి.

    త్వరలోనే అధికారికంగా

    త్వరలోనే అధికారికంగా

    ఇక ఈ కిలాడీ ఖిలాడీ సినిమాను హిందీలో కూడా పెన్ సంస్థ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా అవుట్ పుట్ బాగా రావడంతో సినిమా విడుదలకు ముందే దర్శకుడు రమేష్ వర్మకు నిర్మాత కోనేరు సత్యనారాయణ కోటిన్నర రూపాయలు విలువ చేసే ఒక ప్రీమియం లగ్జరీ కారును బహుమతిగా అందించారు. ఇక ఈ సినిమా విడుదల వాయిదా ప్రకటన త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

    English summary
    Ravi Teja’s Khiladi to be postponed because of AP Government
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X