»   »  హరీశ్ శంకర్ డైరక్షన్ లో మళ్లీ రవితేజ..ఆ రీమేక్

హరీశ్ శంకర్ డైరక్షన్ లో మళ్లీ రవితేజ..ఆ రీమేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొత్తానికి హిందీలో మంచి విజయం సాధించిన 'స్పెషల్‌ ఛబ్బీస్‌' చిత్రం తెలుగు రీమేక్ కు రంగం సిద్దమైంది. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో గతంలో షాక్, మిరపకాయ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. మిరపకాయ చిత్రం మంచి విజయం సాధించి హరీష్ శంకర్ కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చే దిసగా కెరీర్ ని నడిపించింది. ఇప్పుడు ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందని సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'స్పెషల్ చబ్బీస్' చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో పునర్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

1987లో సీబీఐ అధికారుల ముసుగులో ఓ బృందం ముంబైలోని బంగారు దుకాణాన్ని పూర్తిగా దోచేసుకుంది. ఆ సంఘటన ఆధారంగానే రెండేళ్ళ క్రితం అక్షయ్ కుమార్ 'స్పెషల్ చబ్బీస్' మూవీ తెరకెక్కింది. రవితేజతో 'భద్ర' వంటి సూపర్ హిట్ ను నిర్మించిన దిల్ రాజు ఇప్పుడీ హిందీ సినిమాను అతనితోనే రీమేక్ చేయాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది.

Ravi Teja in Special 26 telugu remake

అక్షయ్‌ కుమార్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందిన హిందీ చిత్రం 'స్పెషల్ చబ్బీస్'. 'స్పెషల్ చబ్బీస్' చిత్రం యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో అక్షయ్ నకిలీ పోలీసాఫీసర్‌గా చేశారు. నీరజ్‌పాండే తనదైన శైలిలో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చారు. '1980వ దశకంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సీబీఐ నుంచి వచ్చాం అంటూ నగల దుకాణాల్నీ, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల్నీ ఓ బృందం ఎలా దోచుకొందో తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది.

మార్చి 19, 1987లో ఒక అజ్ఞాత వ్యక్తి తాను సీబీఐ అధికారినని నమ్మబలికి 26 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందంతో ఒపెరా హౌజ్‌లోని త్రిభువన్‌దాస్‌ జవేరీ నగల దుకాణంలో లక్షలాది విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటనను తెరకెక్కించారు. నకిలీ ఐటీ అధికారుల పేరుతో ఇటీవలి సంఘటనల ఆధారంగా దర్శకుడు నీరజ్‌ పాండే ఈ సినిమాను తీసారు. రియా చౌహాన్‌ అనే ఒక ఉపాధ్యాయిని పాత్రలో కాజల్ కనిపించింది.

English summary
Raviteja has confirmed that he is interested to do a heist thriller where he would be looting a jewellery shop. Yes you got it right. We are talking about the remake of Akshay Kumar's sensational flick 'Special 26'.
Please Wait while comments are loading...