twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి: రవితేజ

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. నాకు రాని పనిని నేనెప్పుడూ చేయను. తెలియని పని చేయడం ఎందుకు? నిర్మాణం గురించి నాకు అవగాహన లేదు. అందుకే నిర్మాతగా మారే ఆలోచనలేవీ నాకు లేవు అంటూ తేల్చి చెప్పారు రవితేజ. త్వరలోనే రవితేజ నిర్మాతగా మారబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై మీడియా వారు ప్రశ్నించినప్పుడు ఇలా స్పందించారు.

    అలాగే తనకు దర్శకత్వం చేసే ఆలోచన ఉందని తెలిపారు. ఈ విషయమై చెప్తూ.. ఆ ఆలోచనైతే ఉంది. కానీ... అది ఎప్పుడన్నది మాత్రం చెప్పలేను అన్నారు. తన వరస ప్లాపులపై స్పందిస్తూ... ఇటీవల కాలంలో నేను నటించిన ఒకట్రెండు సినిమాలు ఆశించినంతగా ఫలితాన్నివ్వలేదు. గతాన్ని గురించి ఆలోచించడం అనవసరం. ఇప్పుడేమిటన్నది నాకు ముఖ్యం. 'దరువు' మంచి సినిమానే. కానీ ప్రేక్షకులకు నచ్చలేదు అని అన్నారు.

    వర్మతో చేసిన 'దొంగలముఠా' తరహాలో మళ్లీ ప్రయోగాలేమైనా చేయబోతున్నారా అని అడిగితే... 'దొంగలముఠా' చేశాను కదా. అది మంచి ఫలితాన్ని ఇచ్చుంటే ఇంకా బోలెడన్ని చేసేవాణ్ని. ఇక కొత్తగా ప్రయోగాలు చేసే ఆలోచనేమీ లేదు అని చెప్పారు.

    తన తాజా చిత్రం 'బలుపు' గురించి చెప్తూ... పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. నా శైలి వినోదంతో పాటు యాక్షన్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయి. రెండు కోణాల్లో సాగే పాత్రని ఇందులో పోషించాను. ఓ కోణంలో నా పాత్ర భావోద్వేగాల్ని పంచుతుంది, మరో కోణంలో కావాల్సినంత వినోదం పండుతుంది. పాత్ర డిమాండ్‌ మేరకే ఇందులో గెడ్డంతో కనిపించాల్సి వచ్చింది.

    నా కెరీర్‌లోకెల్లా అత్యధిక వ్యయంతో తెరకెక్కిన సినిమా ఇది. నిర్మాత పీవీపీ నాకు మంచి స్నేహితుడు. తను సినిమాకి ఏం కావాలో అది సమకూర్చాడు. జయనన్‌ విన్సెంట్‌, రామ్‌లక్ష్మణ్‌, స్టన్‌ శివ, కణల్‌ కన్నన్‌ తదితర సాంకేతిక బృందం ఎంతో కష్టపడి పనిచేసింది. బాబీ కథ, కోన వెంకట్‌ మాటలు ఈ చిత్రానికి ప్రధాన బలం. 'డాన్‌శీను' తర్వాత గోపీచంద్‌ మలినేనితో కలిసి చేసిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా అంచనాల్ని అందుకొంటుంది అని అన్నారు.

    English summary
    
 Raviteja Says that he is not intrest to produce films. His latest film Balupu is ready to release this friday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X