twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మెర్సల్’ మెలిక: తెరపైకి అల్లు అరవింద్, శరత్ మరార్ మౌనం.. పవన్‌ కళ్యాణ్ హీరో కాదు కదా?

    మెర్సల్ సినిమా తెలుగు రిలీజ్ ఆగిపోయింది. దీన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా రీమేక్ రైట్స్ అల్లు అరవింద్ దక్కించుకున్నట్లు టాక్. నిజా నిజాలు తేలాల్సి ఉంది.

    By Bojja Kumar
    |

    విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం 'మెర్సల్' దీపావళికి విడుదలై అక్కడ భారీ విజయం సాధించింది. తమిళ వెర్షన్ దాదాపు రూ. 200 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్లతో పాటు ఈ సినిమా అనేక వివాదాలకు కారణమైంది. ఈ సినిమా కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని, జీఎస్టీని టార్గెట్ చేస్తూ ఉందంటూ ఆందోళనలు వెల్లువెత్తడం, కొందరు కేసులు వేయడం తెలిసిందే.

    మెర్సల్ తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదలవ్వాల్సి ఉండగా..... పలు కారణాలతో చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు విడుదలవుతుందో? అసలు విడుదలవుతుందో? లేదో? అనే విషయంలో కూడా క్లారిటీ లేదు.

    మీడియాకు దొరకని శరత్ మరార్, మౌనంగా...

    మీడియాకు దొరకని శరత్ మరార్, మౌనంగా...

    ఈ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ దక్కించుకున్న నిర్మాత శరత్ మరార్ కూడా నోరు విప్పడం లేదు, అసలు ఆయన మీడియాకు దొరకడం లేదు. దీంతో మెర్సల్ తెలుగు విషయంలో కొత్త వార్తలు తెరపైకి వచ్చాయి.

    తెరపైకి అల్లు అరవింద్ పేరు?

    తెరపైకి అల్లు అరవింద్ పేరు?

    ఎవరూ ఊహించని విధంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేరు తెరపైకి వచ్చింది. మెర్సల్ తెలుగు రీమేక్ రైట్స్ గీతా ఆర్ట్స్ అధినేత కొనుగోలు చేశారంటూ ప్రచారం మొదలైంది. ఈ సినిమాను తెలుగులో స్టార్ హీరోతో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

    నిజంగా అలా జరుగుతుందా?

    నిజంగా అలా జరుగుతుందా?

    మెర్సల్ సినిమా తెలుగులో ‘అదిరింది' పేరుతో డబ్ అయి, తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సినిమా రిలీజ్ అవుతుందని ఆన్‌లైన్ టిక్కెట్లు కూడా ఇష్యూ చేశారు. అయితే చివరి నిమిషంలో సినిమా విడుదల ఆగిపోవడంతో టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. థియేటర్ వరకు వచ్చిన ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ ఆపి... దాని రీమేక్ రైట్స్ మరో నిర్మాత దక్కించుకోవడం లాంటివి అసలు జరుగుతాయా? ఏమో... ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చిన వార్తలు వింటుంటే ఏది నమ్మాలో... నమ్మకూడదో అర్థం కావడం లేదు.

    పవన్ కళ్యాణ్ హీరో కాదుకదా?

    పవన్ కళ్యాణ్ హీరో కాదుకదా?

    అల్లు అరవింద్ ‘మెర్సల్' తెలుగు రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్లు గాలివార్తలు విన్న తర్వాత రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమానుగానీ పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయరు కదా? అంటూ కొందరు సందేహ పడుతున్నారు.

    ఒక వేళ పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేస్తే...

    ఒక వేళ పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేస్తే...

    పవన్ కళ్యాణ్ ఈ మధ్య చాలా రీమేక్ సినిమాలు చేశారు. మెర్సల్ తెలుగు వెర్షన్ ఆయనతో రీమేక్ చేస్తే..... పొలిటికల్ పరంగా ఈ సినిమా ప్లస్సయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆల్రెడీ మెర్సల్ మూవీలోని కొన్ని సీన్లు, డైలాగులు రాజకీయ వివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే.

    English summary
    If buzz is to be believed, the Telugu remake rights of Mersal have been sold to mega producer Allu Aravind for a fancy price. Talk is that Aravind is planning to make it on a lavish scale with a star hero on his home banner Geetha Arts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X