»   » షాక్: తమన్నా...అతన్ని పెళ్లి చేసుకుంటన్నావా...నిజమా? కొన్ని సీక్రెట్స్

షాక్: తమన్నా...అతన్ని పెళ్లి చేసుకుంటన్నావా...నిజమా? కొన్ని సీక్రెట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నేషనల్ టాబ్లెయిడ్ లో ఓ న్యూస్ తమన్నా అభిమానులను ఈ రోజు షాక్ కు గురించి చేసింది. అదేమిటంటే..తమన్నా పెళ్లి చేసుకోబోతోందని. ఆ వార్తలో ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని చాలా కాలంగా డేటింగ్ చేస్తోందని,వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని, అందుకు పెద్దలు అనుమతి కూడా ఇచ్చినట్లే అని రాసుకొచ్చింది.


ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి పెళ్లి అనంతరం తమన్నా సినిమాలకు దూరం కానుందనే కూడా పనిలో పనిగా చెప్పేసారు. అంతేకాదు..రణవీర్ సింగ్ తో ఆమె చేస్తున్న సినిమా నే ఆఖరి సినిమా అని చెప్తూ రాసొచ్చారు.

ఒక్కో హీరో గురించి తమన్నా ఒక్కో రకంగా..(ఫొటో ఫీచర్)

పెళ్ళయ్యాక సినిమాలు మానేసి.. తాను స్థాపించిన గోల్డ్ డిజైన్ కంపెనీ వైట్ అండ్ గోల్డ్ బిజినెస్ చూసుకుంటుందని వినిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న బాహుబలి -2 లో నటిస్తున్న తమ్మూ ఈ విషయమై ఏం చెప్తుందో చూడాలి.

లేకపోతే రేపో, మాపో...అవన్నీ కేవలం రూమర్స్, ఇలాంటివేమన్నా ఉంటే డైరక్ట్ గా నన్నే అడగాలి కదా..మీ అంతట మీరే రాసేస్తే ఎలా,అయినా అంత శుభవార్త నేనే మీకే ముందు చెప్తాను అని కూడా అనే అవకాసం ఉంది.

తమన్నాకి నచ్చిన తెలుగు సినిమాలివే (ఫొటో ఫీచర్)

అనుకున్నట్లుగానే తమన్నా ...ఈ మ్యారేజ్ కు సంభందించిన రూమర్స్ ని ఖండించింది ఓ ట్వీట్ ద్వారా... ఇదిగో ఆమె ఏమందో ఇక్కడ చూడండి..

దక్షిణాదితో పాటు హిందీలోనూ తనదైన ముద్ర వేసిన హీరోయిన్ ఈమె. అందంలోనే కాదు, అభినయంలోనూ తిరుగులేదని చాటి చెప్పింది. ఫ్యాషన్‌ విషయంలోనూ ఆమె ముందుంటుంది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'అభినేత్రి' అనే హారర్‌ సినిమాలో నటిస్తోంది.


స్లైఢ్ షోలో తమన్నా కు చెందిన మరిన్ని విశేషాలు,సీక్రెట్స్

ఎవరూ రారు..

ఎవరూ రారు..

''ఎవరూ పుట్టుకతోనే అన్నీ నేర్చుకొని రాలేరు. అవసరాలు, అనుభవాలతోనే ఒకొక్కటిగా తెలిసొస్తుంటాయి. నేను నేర్చుకొన్నదంతా అలాగే'' అంటోంది తమన్నా.

 ఇన్ని విషయాలపై ఎలా పట్టు సాధించారు?

ఇన్ని విషయాలపై ఎలా పట్టు సాధించారు?

అని అడిగితే అవసరమే అన్నీ నేర్పించిందని చెబుతోంది తమన్నా

అబిరుచి

అబిరుచి

''నాకున్న అభిరుచి టీనేజ్‌లోనే సినీ పరిశ్రమలోకి ప్రవేశించేలా చేసింది.

దక్షిణాదికి రావటం..

దక్షిణాదికి రావటం..

అదొక ఎత్తయితే ఆ వయసులో నాకసలు పరిచయమే లేని దక్షిణాదికి రావడం మరో ఎత్తు.

భయపడలేదు

భయపడలేదు

నేను ఏ దశలోనూ భయపడలేదు అంటోంది తమన్నా..సంకల్పం ముందు ప్రాంతం, భాష అడ్డు కావనే ధైర్యం నాకు ముందు నుంచీ ఉంది.

అనుకున్నట్టుగానే ...

అనుకున్నట్టుగానే ...

దక్షిణాది వాతావరణానికి వేగంగా అలవాటు పడ్డా. జయాపజయాల గురించి ఆలోచించకుండా పనిని ఆస్వాదించడం అలవాటు చేసుకొన్నా. ఆ క్రమంలోనే అన్నీ బోధపడ్డాయి.

కంగారు లేదు

కంగారు లేదు

నటనలోనే కాదు, ఫ్యాషన్స్‌ గురించి నేనెప్పుడూ కంగారుపడలేదు.'అందరూ పరిశీలించి నేర్చుకొన్నదే కదా! అందరికీ అనుభవంతో వచ్చిందే కదా!'

అదే నిలబెట్టింది

అదే నిలబెట్టింది

నేనూ నేర్చుకోవడం మొదలుపెట్టా. ఆ ప్రయత్నమే నన్నిలా నిలబెట్టిందని చెప్పుకొచ్చింది తమన్నా.

జెనిటకల్ గా ..

జెనిటకల్ గా ..

తమన్నా మేని ఛాయ జెనిటికల్‌గా వచ్చింది. ఆమె అమ్మా, నాన్న కూడా తెల్లగా ఉంటారు. వాళ్లకన్నా తమన్నా రంగు ఇంకా ఎక్కువ.

నలుగే పెట్టుకుంటా

నలుగే పెట్టుకుంటా

చిన్నప్పట్నుంచీ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వాడే అలవాటు తనకు లేదు. సెనగపిండి, పసుపు పొడి, వేపాకు పొడి.. వీటిని రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి అమ్మ ఇచ్చిన మిశ్రమాన్ని మొహానికి అప్లయ్ చేసుకునేది. పెద్దయ్యాక కూడా అదే ఫాలో అవుతున్నారు.

నో షాంపూ

నో షాంపూ

షాంపూలూ అస్సలు వాడరు. హెయిర్ వాష్ కోసం హెర్బల్ పౌడర్స్‌ని వాడతారు. బొప్పాయి, ఉసిరి, శీకాకాయ్‌లతో పొడి తయారు చేసుకుంటారు. అవుట్‌డోర్ షూటింగ్స్ కారణంగా సూర్య రశ్మి బాగా సోకుతుంది కాబట్టి, దాదాపు ప్రతి రోజూ హెయిర్ వాష్ చేసుకుంటారామె.

మజిల్స్ రిలాక్స్

మజిల్స్ రిలాక్స్

వీలు కుదిరినప్పుడల్లా...ఒంటికి నలుగు పెట్టుకుంటారు. అది కూడా ఇంట్లో తయారు చేసిన పొడులతోనే. నలుగు పెట్టుకోవడం వల్ల మజిల్స్ రిలాక్స్ అవుతాయని అంటారామె.

క్లీన్

క్లీన్


రాత్రి నిద్రపోయే ముందు మేకప్ క్లీన్ చేసేస్తారు. షూటింగ్స్ లేకపోతే మేకప్ జోలికి వెళ్లరు.

కంపల్సరీ

కంపల్సరీ

ప్రతి రోజూ జిమ్ కంపల్సరీ. కార్డియో ఎక్సర్‌సైజ్, ఫ్రీ హ్యాండ్ ఎక్సర్‌సైజ్.. ఇలా జిమ్‌లో పలు వ్యాయామాలు చేస్తారు. ఏది చేసినా ట్రైనర్ ఆధ్వర్యంలోనే. జిమ్‌కి కనీసం గంట సేపైనా కేటాయిస్తారు.

ఉదయమే..

ఉదయమే..

ముందు రోజు రాత్రి నానబెట్టిన గుప్పెడు బాదం పప్పులను మర్నాడు ఉదయం తింటారు. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగుతారు.

పెరుగంటే..

పెరుగంటే..

తమన్నాకి పెరుగంటే చాలా ఇష్టం. శరరీం కూల్‌గా ఉండటానికి పెరుగు చాలా ఉపయోగపడుతుందని, కాల్షియమ్ ఎక్కువగా ఉంటుందని ఆమె అంటారు.

ఎక్కువ వాటర్

ఎక్కువ వాటర్

రోజు మొత్తంలో సూప్స్, పండ్ల రసాలు, నీళ్లు ఎక్కువగా తాగుతారు. తమన్నా చర్మం మెరవడానికి అదో కారణం.

దూరంగా..

దూరంగా..

ఫ్రైడ్ ఫుడ్, టిన్ ఫుడ్స్‌కి దూరంగా ఉంటారు. అప్పటికప్పుడు కుక్ చేసిన ఫుడ్‌నే తీసుకుంటారు. ఆయిలీ ఫుడ్ తినరు.

ఇంకా సన్నంగా..

ఇంకా సన్నంగా..

బేసిక్‌గా తమన్నా సన్నగానే ఉంటారు. కానీ, సినిమాల కోసం ఇంకా సన్నబడ్డారు. అలా సన్నబడటం కోసం తనకు చాలా ఇష్టమైన ఫ్రైడ్ ఫుడ్స్‌ని తాగ్యం చేసేశారు.

ముఖంపై

ముఖంపై

అందం కోసం ఎంత చేసినా మానసికంగా ఒత్తిడికి గురైతే మాత్రం అది బయటకు కనిపించేస్తుందంటారు తమన్నా.

కూల్ గా..

కూల్ గా..

అందుకే వీలైనంత కూల్‌గా ఉండటానికి ట్రై చేస్తారు.

ఎప్పుడూ నవ్వుతూనే..

ఎప్పుడూ నవ్వుతూనే..

'ఎ లాఫ్టర్ ఈజ్ బెస్ట్ టానిక్' అంటారు తమన్నా. అందుకే పెదాలపై చిరునవ్వు చెరగనివ్వరు.

అదృష్టం

అదృష్టం

'ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్ గా పరిశ్రమలో కొనసాగుతుండడం నా అదృష్టం' అని చెబుతోంది. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో నెగ్గుకురావడం చాలా సులభం అంటోంది.

అందుకే..

అందుకే..

''కథలు ఇచ్చి పుచ్చుకోవడం ఇటీవల అధికమైంది. నటీనటుల మార్పిడి కూడా జరుగుతోంది. ఒక భాషకి చెందిన వారికి మరోచోట అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. మేమంతా తీరిక లేకుండా గడుపుతున్నామంటే కారణం అదే.

ప్రతిభ చూపితే చాలు

ప్రతిభ చూపితే చాలు

మేమే కాదు... కొత్త వాళ్త్లెనా కాస్త ప్రతిభ చూపితే చాలు. స్థిరపడిపోయినట్టే'' అంటోంది తమన్నా

అవే సాహసం

అవే సాహసం

''నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చాలా చేశాను. అందులో కొన్ని డీగ్లామరైజ్డ్‌ పాత్రలు కూడా ఉన్నాయి. వాటన్నిటికంటే వాణిజ్య ప్రధానమైన చిత్రాల్లో నటించడమే సాహసమనిపించింది.

అందుకే కష్టం..

అందుకే కష్టం..

కథంతా హీరో చుట్టూనే తిరుగుతుంటుంది. ఆ సమయంలోనూ హీరోయిన్ గా మా ముద్రవేయాల్సి ఉంటుంద''ని చెప్పుకొచ్చింది తమన్నా.

సంతృప్తి లేదు

సంతృప్తి లేదు

తన సినీ జీవితంలో ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో సంతృప్తి ఇచ్చిన పాత్ర ఏదీ లేదని చెబుతోంది.

విలన్ షేడ్స్

విలన్ షేడ్స్

'నాకు ఎప్పట్నుంచో విలన్ షేడ్స్ లున్న పాత్ర చేయాలనుంది. ఆ అవకాశం వచ్చి, అది బాగా పండితే.. అదే నాకు నచ్చిన పాత్ర అవుతుంది' అని చెబుతోంది తమన్నా .

అభినేత్రిలో బిజీ

అభినేత్రిలో బిజీ

ప్రస్తుతం తమన్నా..అభినేత్రి, బాహుబలి సీక్వెల్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.

English summary
A National Tabloid, saying that Milky Beauty Tamanna Bhatia is all set to get married. It's rumoured that she's dating a software engineer from a long time and the two are getting ready to start their family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu