»   » ఏది నిజం? : పవన్ 'సర్దార్' కి బై చెప్పటం వెనుక

ఏది నిజం? : పవన్ 'సర్దార్' కి బై చెప్పటం వెనుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ నుంచి ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ జయనేని విన్సెంట్ బయిటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన బయటకు రావటానికి కారణం ఈ చిత్రం కొత్త షెడ్యూల్ లో ఇగో క్లాషెష్ చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. జయనేని విన్సెంట్ తో దర్శకుడు బాబికి కొన్ని ఇగో క్లాషెష్, క్రియేటివ్ డిస్ట్రిబెన్సెలు చోటు చేసుకున్నాయని, దాంతో జయన్ విన్సెంట్ బయిటకు వచ్చేసారని చెప్పుకున్నారు. అయితే ఈ విషయమై మరో టాక్ సినీ వర్గాల్లో వినపడుతోంది.

sardhar

జయనేని బయిటకు రావటానికి కారణం ...గోపీచంద్ తో ఆయన ప్రాజెక్టు ఓకే కావటమే అంటున్నారు. ఆయన ఓ చిత్రం డైరక్ట్ చేయాలనే ఆలోచనలో పవన్ సినిమానుంచి బయిటకు వచ్చాడని చెప్పుకుంటున్నారు. ఆ చిత్రం ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ లో ఉందని అందుకే ఆయన బై చెప్పి వచ్చేసాడని చెప్పుకుంటున్నారు. అయితే ఆ విషయం ముందే ఆయనకు తెలిసినప్పుడు పవన్ ప్రాజెక్టు ఒప్పుకోడు, అలాంటి వ్యక్తి కాదు అని మరికొందరు వాదిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేస్తున్నప్పుడు అలా మధ్యలో వదిలేసి రావటానికి బలమైన కారణం మరేదో ఉంటుందని ఆయన అభిమానులు అంటున్నారు.

పవన్ కు, జయనేని కు అనుబంధం చాలా కాలం నుంచి కొనసాగుతోందని, అదీ ఓ షెడ్యూల్ అయ్యాక ఆయన వెళ్లి గోపీచంద్ ప్రాజెక్టు చెయ్యాలని నిర్ణయించుకోవటం అనేది చిత్రంగా ఉందంటున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చేసాక గోపీచంద్ ని కలిసి ఈ నిర్ణయం తీసుకుని ఆయన్ను ఆయన బిజీ చేసుకునే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు.

pawan

అయితే ఈ విషయమై పవన్ మధ్యలో వేలు పెట్టలేదని, బాబి తనకు నచ్చిన కెమెరామెన్ ఆర్దర్ ఎ విల్స్ ని తీసుకువచ్చి మిగతా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే షూటింగ్ డిలే అవుతూ వస్తోందని అంటున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.

English summary
Buzz is that Jayanan Vincent's directorial plans are said to be the reason behind his opting out of Pawan's film Sardaar Gabbar Singh.
Please Wait while comments are loading...