»   » రేయ్...పవన్ కళ్యాణ్ రావడం లేదనే?

రేయ్...పవన్ కళ్యాణ్ రావడం లేదనే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన 'రేయ్' చిత్రం ఆడియో విడుదల జనవరి 5న ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మేనల్లుడి తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ కూడా రావడానికి ఒప్పుకున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం ఆడియో వేడుక ముందుగా అనుకున్నట్లుగా జనవరి 5న చేయడం లేదని, వాయిదా పడిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండి రాకలేక పోతున్నారని.....అందుకే ఆడియో వేడుక వాయిదా వేయాల్సి వచ్చిందని 'రేయ్' యూనిట్ సభ్యులు చెప్పినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ ఎందుకు రావడం లేదు? సినిమా షూటింగులు కూడా లేవు కదా అంత బిజీ ఏమిటి? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఎందుకంటే ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆయనకు ఉంటాయి. పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇటీవల జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.

రేయ్ ఆడియో విడుదల వాయిదా పడటానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం 100 రోజుల వేడుక జరుగుతోంది. ఈ నేపథ్యంలో అభిమానుల విన్నపం మేరకు ఆడియో వేడుక వాయిదా వేసారనే ఓ వాదన కూడా వినిపిస్తోంది. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, సయామి ఖేర్, శ్రద్ధా దాస్ హీరో హీరోయిన్లు.

English summary
Sai Dharam Teja's Rey Audio Launch postponed. Pawan Kalyan who was invited as chief guest informing the makers that he is too busy to attend the event surfaced as the possible reason.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu