»   »  ఆ సినిమాకి సీక్వెల్ గా వర్మ ... 'పట్టపగలు'?

ఆ సినిమాకి సీక్వెల్ గా వర్మ ... 'పట్టపగలు'?

Posted By:
Subscribe to Filmibeat Telugu
 RGV Pattapagalu is a sequel
హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ మరో వరస ఫ్లాపుల హీరో రాజశేఖర్ తో పట్టపగలు చిత్రం చేస్తున్నాడు అనే సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ చిత్రం రామ్ గోపాల్ వర్మ హర్రర్ చిత్రం 'రాత్రి' కి సీక్వెల్ అని తెలుస్తోంది. ఈ చిత్రం హర్రర్ జనర్ లో నడుస్తుందని, అందుకే రివర్స్ లో పట్టపగలు అనే టైటిల్ ఈ చిత్రానికి పెట్టారని అంటున్నారు. దీనికి రాజశేఖరే నిర్మాత అని చెప్తున్నారు. ఆల్రెడీ చిత్రం షూటింగ్ పూర్తి చేసాడని తెలుస్తోంది.

పట్టపగలు అనే టైటిల్ తో చిత్రం చేస్తానని వర్మ చాలా కాలంగా భయపెడ్తున్నారు. అది త్వరలోనే మన ముందుకు రానుందని తెలుస్తోంది. దాదాపు 15 రోజులు రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి. ఈ మేరకు ఎడిటింగ్ వర్క్ ప్రారంభమయ్యిందని అంటున్నారు. అయితే మీడియాకు ఈ విషయం లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని మేనేజ్ చేసాడని,కొంతమంది మీడియా మిత్రలుకు తెలిసినా దాన్ని బయిటకు రానివ్వకుండా వర్మ రిక్వెస్ట్ చేసాడని అంటున్నారు.

ఇరవై రోజుల క్రితమే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైందని తెలుస్తోంది. ఇద్దరూ ప్లాప్ లలో ఉన్నారు కాబట్టి హిట్ వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. వర్మ పాయింట్ చెప్పిన వెంటనే థ్రిల్ అయిన రాజశేఖర్ డేట్స్ ని ఇవ్వటానికి ముందుకు వచ్చాడని వినికిడి. ఖాళీగా ఉన్న రాజశేకర్ కి ఈ చిత్రంతో బిజీ అవుతాడని అంటున్నారు. ఈ చిత్రంలో కొద్దిగా పొలిటికల్ టచ్ కూడా ఉండే అవకాసం ఉందని అంటున్నారు.

మరో ప్రక్క రామ్ గోపాల్ వర్మ దర్శకుడుగా,మోహన్ బాబు నిర్మాతగా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రీసెంట్ గానే ప్రారంభమై, ఆ మేరకు షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఈ చిత్రానికి 'ఒట్టు' అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

English summary
Ram Gopal Varma impressed all with his horror film ‘Raathri’ some time back. The film starring Revathi was acclaimed as a technically brilliant one. Now it seems Ramu is coming with a sequel for ‘Raatri’. His new film is titled as ‘Patta Pagalu’ and stars Rajasekhar and Swathi Dixit in key roles. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu