»   » షాక్: రామ్ గోపాల్ వర్మ-రాజ శేఖర్ చిత్రం పూర్తైంది

షాక్: రామ్ గోపాల్ వర్మ-రాజ శేఖర్ చిత్రం పూర్తైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ మరో షాక్ ఇవ్వటానికి సిద్దమయ్యారు. ఆయన రాజశేఖర్ తో చిత్రం చేస్తున్నాడు అని వార్తల్లో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన ఆల్రెడీ చిత్రం షూటింగ్ పూర్తి చేసాడని తెలుస్తోంది. దాదాపు 15 రోజులు రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి. ఈ మేరకు ఎడిటింగ్ వర్క్ ప్రారంభమయ్యిందని అంటున్నారు. అయితే మీడియాకు ఈ విషయం లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని మేనేజ్ చేసాడని,కొంతమంది మీడియా మిత్రలుకు తెలిసినా దాన్ని బయిటకు రానివ్వకుండా వర్మ రిక్వెస్ట్ చేసాడని అంటున్నారు.

రాజశేఖర్ తో ఆయన థ్రిల్లర్ చిత్రం షూట్ చేసారని తెలుస్తోంది. అది పోలీస్ సబ్జెక్ట్ అని చెప్పుకుంటున్నారు. ఇరవై రోజుల క్రితమే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైందని తెలుస్తోంది. ఇద్దరూ ప్లాప్ లలో ఉన్నారు కాబట్టి హిట్ వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. వర్మ పాయింట్ చెప్పిన వెంటనే థ్రిల్ అయిన రాజశేఖర్ డేట్స్ ని ఇవ్వటానికి ముందుకు వచ్చాడని వినికిడి. ఖాళీగా ఉన్న రాజశేకర్ కి ఈ చిత్రంతో బిజీ అవుతాడని అంటున్నారు. ఈ చిత్రంలో కొద్దిగా పొలిటికల్ టచ్ కూడా ఉండే అవకాసం ఉందని అంటున్నారు.

RGV and Rajasekhar

రామ్ గోపాల్ వర్మ,మోహన్ బాబు నిర్మాతగా చిత్రం చేయనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోందని, ఆ మేరకు పనులు జోరుగా జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. మోహన్ బాబు సైతం ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి అయ్యిందని,లక్ష్మి ప్రసన్న బ్యానర్ పై ఈ చిత్ర నిర్మాణం జరగనుంది.

అలాగే ఈ చిత్రం పూర్తి స్ధాయి కామెడీతో సాగుతుందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. వర్మ గతంలో రూపొందించిన మనీ,అనుకోకుండా ఒక రోజు,క్షణ క్షణం తరహాలో ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, స్టోరీ లైన్ విని వెంటనే మోహన్ బాబు ఈ చిత్రం చేయటానికి ఆసక్తి చూపించారని అంటున్నారు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ కొత్త చిత్రం విషయమై రామ్ గోపాల్ వర్మ నుంచి ఏ విధమైన ప్రకటన లేదు. 2014 జనవరి నుంచి ప్రారంభం అయ్యే అవకాసం ఉంది.

English summary
Reliable sources revealed that RGV-Rajashekar film was started 20 days back and RGV completed entire shooting of the film in 15 days secretly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu