»   » షాక్: రామ్ గోపాల్ వర్మ ఆ హీరోతోనా..?

షాక్: రామ్ గోపాల్ వర్మ ఆ హీరోతోనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu
 RGV's New Movie With Dr. Raja Sekhar
హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ స్టేట్ మెంట్స్ విషయంలోనే కాదు...కెరీర్ విషయంలోనూ సంచలన నిర్ణయాలు తీసుకుని అందరికీ షాక్ లు ఇస్తున్నాడు. తాజాగా మంచు కుటుంబంతో టై అప్ అయ్యి మంచు విష్ణు, మోహన్ బాబు కాంబినేషన్ లో సినిమా చేస్తున్న వర్మ... త్వరలో మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు...వరస డిజాస్టర్స్ తో దూసుకుపోతున్న రాజశేఖర్.

రాజశేఖర్ తో ఆయన థ్రిల్లర్ చిత్రం ప్లాన్ చేసారని తెలుస్తోంది. అది పోలీస్ సబ్జెక్ట్ అని చెప్పుకుంటున్నారు. ఇద్దరూ ప్లాప్ లలో ఉన్నారు కాబట్టి హిట్ వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. వర్మ పాయింట్ చెప్పిన వెంటనే థ్రిల్ అయిన రాజశేఖర్ డేట్స్ ని ఇవ్వటానికి ముందుకు వచ్చాడని వినికిడి. ఖాళీగా ఉన్న రాజశేకర్ కి ఈ చిత్రంతో బిజీ అవుతాడని అంటున్నారు. ఈ చిత్రంలో కొద్దిగా పొలిటికల్ టచ్ కూడా ఉండే అవకాసం ఉందని అంటున్నారు.

రామ్ గోపాల్ వర్మ,మోహన్ బాబు నిర్మాతగా చిత్రం చేయనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోందని, ఆ మేరకు పనులు జోరుగా జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. మోహన్ బాబు సైతం ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి అయ్యిందని,లక్ష్మి ప్రసన్న బ్యానర్ పై ఈ చిత్ర నిర్మాణం జరగనుంది.

అలాగే ఈ చిత్రం పూర్తి స్ధాయి కామెడీతో సాగుతుందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. వర్మ గతంలో రూపొందించిన మనీ,అనుకోకుండా ఒక రోజు,క్షణ క్షణం తరహాలో ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, స్టోరీ లైన్ విని వెంటనే మోహన్ బాబు ఈ చిత్రం చేయటానికి ఆసక్తి చూపించారని అంటున్నారు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ కొత్త చిత్రం విషయమై రామ్ గోపాల్ వర్మ నుంచి ఏ విధమైన ప్రకటన లేదు. 2014 జనవరి నుంచి ప్రారంభం అయ్యే అవకాసం ఉంది.

English summary
Now the news is making rounds that the ace director RGV is doing a movie with senior actor Dr. Raja Sekhar.The movie is designed as a thriller and is expected to revive both the actor and the director's careers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu