»   » తెలుగు డైరక్టర్స్ కి షాకిస్తూ రామ్ గోపాల్ వర్మ

తెలుగు డైరక్టర్స్ కి షాకిస్తూ రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తూంటారు. తాజాగా ఆయన ఇప్పుడు డైరక్టర్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారారు. 12 నెలల్లో(ఒక సంవత్సరం)లో 12 సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన బిజీగా షెడ్యూలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రాజశేఖర్ తో పట్టపగలు, మోహన్ బాబు తో రౌడీ చిత్రాలు ఫినిష్ చేసారు.

ఇంత స్పీడుగా చేయటం ... మిగతా డైరక్టర్స్ కు షాక్ గా మారింది. మన తెలుగులో చాలా మంది దర్శకులు స్లోగా సినిమాలు పూర్తి చేస్తూంటారు. రెండేసి,మూడేసి సంవత్సరాలు కూడా సినిమాలు పూర్తి చేయటానికి సమయం తీసుకుంటూంటారు. అంత కష్టపడి,టైమ్ తీసుకున్నా సినిమాలు ఫ్లాప్ అవుతూండటం జరుగుతోంది. ఈ నేపధ్యంలో నెలలో అన్ని పనులు పూర్తి చేసి,రిలీజ్ చేస్తే ఫ్లాఫ్ అయినా పెద్దగా నష్టపోయేదేమీ ఉండదంటున్నారు.

12 films in 12 months

రౌడీ విషయానవికి వస్తే ..."రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించడం చాలా కంఫర్టబుల్‌గా ఉంది. 'రౌడీ'ని ఆయన తెరకెక్కిస్తున్న తీరు అద్భుతం. ఈ సినిమాలో ఆయన నా పాత్ర ఆహార్యాన్ని తీర్చిదిద్దిన విధానం అభినందనీయం'' అని అంటున్నారు డా.మంచు మోహన్‌బాబు. ఆయన కీలక పాత్రలో ఎ.వి.పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'రౌడీ'. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్ నిర్మాతలు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. మంచు విష్ణు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. నిర్మాతలు మాట్లాడుతూ "చాలా కాలం తర్వాత మోహన్‌బాబుకు జంటగా జయసుధ నటిస్తున్నారు. విష్ణుకు జోడీగా శాన్వి నటిస్తోంది. సాయికార్తిక్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 'పెదరాయుడు', 'రాయలసీమ రామన్న చౌదరి' తర్వాత మోహన్‌బాబుగారు విగ్ లేకుండా చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తారు. మంచు విష్ణు-శాన్వి జంట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది'' అని చెప్పారు.

English summary
Ace filmmaker RGV has resolved to make 12 films in 2014 which roughly works out to one film every month to touch his dozen movies mark.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu