For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమాని మించిన మాయ!!('రోబో' కన్నారావు మిస్టరీ హిస్టరీ)

  By Srikanya
  |

  దాదాపు 27 కోట్లు పెట్టి రజనీకాంత్ తాజా చిత్రం తెలుగు రైట్స్ తీసుకున్న నిర్మాతగా తోట కన్నారావు ఒక్కసారిగా హైలెట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తోట కన్నారావు చరిత్ర తెలిసిన వాళ్ళు మాత్రం ఈ నిజాన్ని ఇప్పటివరకూ జీర్ణించుకోలేకపోతున్నారు. పశ్ఛిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడేనికి చెందిన కన్నారావు తాతల ఆస్తిని ఆయన తండ్రి కరిగించేసారు. ఆర్ధిక స్ధోమత లేకపోవటంతో చదవును తొమ్మిదో తరగతితోనే ఆపేసి పొగాకు చుట్టల సంచిలో పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాడు. అయితే ఆ వ్యాపారం లాభసాటిగా లేకపోవటంతో కొద్ది రోజులకే దానికి స్వస్ధి చెప్పి..రోడ్డు ప్రక్కన సోడాలు అమ్మే వ్యాపారం మొదలెట్టాడు. తర్వాత కూలీల నుంచి చిన్నా చితకా వస్తువుల్ని తాకట్టు పెట్టుకుని వడ్డికి డబ్బులిచ్చే వాడు.

  ఎన్ని చేసినా ఏదీ పెద్దగా ఎదిగే అవకాశం ఇవ్వలేదు. దాంతో 1985 లో ధాన్యం కమీషన్ వ్యాపారం పెట్టి దివాళా తీసి దాదాపు పది లక్షల వరకూ ఐపీ పెట్టాడు. తర్వాత మామగారి రైసు మిల్లు లీజుకు తీసుకున్నాడు. అదీ విజులెన్స్ వారు అక్రమ ధాన్యం పట్టుకోవటంతో మూతపడింది. దాంతో నిడమర్రుకి చెందిన వ్యాపారికి దాన్ని జీడిపప్పుల మిల్లుగా మార్చి లీజుకు ఇచ్చాడు. అయితే అప్పుడు లీజు దారుడు దగ్గర తీసుకున్న అప్పు చెల్లించకపోవటంతో ఆ వ్యాపారి కిడ్నాప్ చేసాడు. కాకినాడలో ఉంటున్న కన్నారావుని ఆయన సభ్యులు విడిపించారు. అక్కడ నుంచి వచ్చాక మళ్ళీ బియ్యం వ్యాపారం పెట్టాడు. ఆ తర్వాత మొక్క జొన్న ఎగుమతి చేస్తూ ఆ వ్యాపారంలోకి ప్రవేశించాడు.

  మూడేళ్ళ క్రితమే శ్రీ కృష్ణా ట్రేడర్స్ పేరుతో మొక్క జొన్న వ్యాపారం ప్రారంభించిన కన్నారావు..దేవరపల్లి మండలం కాపవరంలోని గోదాముల్లో నిల్వ చేసేవారు. అయితే ఏళ్ళ తరబడి వాటిని ఎగుమతి చేయకపోవటంతో అవి ఎలుకలు, పంది కొక్కులుకు ఆహారంగా మారాయి. దీన్ని బట్టే ఆయన వ్యాపారం ఎలా చేసేవారో,ఎంత ఎగుమతి చేసేవారో అనేది అర్ధమవుతుందంటున్నారు తోటి వ్యాపారస్తులు. ఇక ఇలా వ్యాపారం జరగీ,జరుగనట్లు నడస్తున్న సమయంలోనే ఆదాయపు పన్ను అధికారులు ఆయన ఇంటిపై దాడి చేసారు. అప్పుడు బారీగా నోట్ల కట్టలు లభించినట్లు సమాచారం. అయితే అధికారులు అక్కడేమీ దొరకలేదని వెళ్ళిపోయారు.

  ఇలా ఏమీ లేని స్ధితిలో జీవితం ప్రారంభించిన కన్నారావుకి ఇప్పుడు హైదరాబాద్, బెంగుళూరు వంటి మెట్రో నగరాల్లో బినామీ పేర్లతో కోట్ల కొలదీ అస్ధులున్నాయని సమాచారం. కొవ్వూరు మండలం.ఐ.పంగిడి, కాపవరం మధ్య రోడ్డుని ఆనుకుని ఉన్న ఖరీదైన భూమిని రీసెంట్ గానే ఆయన కొనుగోలు చేసారు. అలాగే కాపవరం జంక్షన్ వద్ద సుమారు ఐదెకరాలు పొలం కొన్నారు. ఇక ఐ పంగడి, మీనా నగరంలో మార్గ మధ్యంలో ఉండే రైసు మిల్లుని కూడా రీసేంట్ గా కొనుగోలు చేసారు.

  ఇక రోబో చిత్రాన్ని ఇన్ని కోట్లు వెచ్చించి కొన్నారని తెలిసిన గ్రామస్ధులు ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేదు. కన్నారావు కి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు బాల మురళీ కృష్ణ..నాలుగేళ్ళ క్రితం అనుమాదస్పద పరిస్ధితిలో మృతి చెందారు. ఇక ఆయన రెండో కుమారుడు ఎంబిఎ చదివాడు. అతనికి ఉద్యోగం ఇవ్వటానికి ఓ కార్పోరేట్ బ్యాంక్ వారు షూరిటీ అడిగితే...కన్నారావు ఏకంగా కోటి రూపాలయలు డిపాజిట్ చేయటంతో అంతా షాక్ అయ్యారు.

  అంతెందుకు రోబో హక్కులు సంపాదించుకున్న సందర్భంగా కన్నారావు..అక్కడి స్ధానికులని యర్నగూడెం నుంచి దాదాపు 30 కార్లలో హైదరాబాద్ తీసుకొచ్చి తాజ్ హోటల్ లో పెద్ద విందు చేసారు. జల్సాలకు విపరీతంగా ఖర్చుపెట్టే కన్నారావు కి ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందనేది మొదటి నుంచి అక్కడ జనాలికి డౌటే. ఆయన ఎవరికన్నా బినామీగా వ్యవహిస్తున్నారా లేక వేరే రూపంలో ఇంతింత మొత్తాలు సంపాదిస్తున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే మొక్క జొన్న వ్యాపారంలో ఆయనది నామ మాత్రం. ఇదే మ్యాటర్ ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X