»   » అదీ ఇపుడు ప్రభాస్ రేంజి: ‘సాహో’ మూవీకి రూ. 400 కోట్ల ఆఫర్!

అదీ ఇపుడు ప్రభాస్ రేంజి: ‘సాహో’ మూవీకి రూ. 400 కోట్ల ఆఫర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ సినిమా రేంజి తెలుగు సినిమా పరిధి దాటి జాతీయ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. బాహుబలి ప్రాజెక్టుతో ప్రభాస్ సినిమాలకు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ మార్కెట్లలో కూడా డిమాండ్ బాగా పెరిగింది.

అందుకే ఇపుడు ప్రభాస్ సినిమా అనగానే ఈరోస్ లాంటి పెద్ద సినీ నిర్మాణ సంస్థలు వందల కోట్లు గుమ్మరించడానికి సిద్ధపడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ నటిస్తున్న 'సాహో' సినిమాను దక్కించుకునేందుకు ఈరోస్ సంస్థ రూ. 400 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవి ప్రొడక్షన్స్ కూడా ఈ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసినట్లు సమాచారం.


బాహుబలి ఎఫెక్టే

ప్రభాస్ నటించిన బాహుబలి-2 చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 1500 కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో..... ‘సాహో' సినిమాపై అంచనాలు పెరిగాయి. బాహుబలి రేంజిలో కాక పోయినా కనీసం రూ. 500 కోట్లయినా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


ఈరోస్ ముందుగా

ఈరోస్ ముందుగా

ప్రభాస్ సినిమా స్టామినాను ముందే ఊహించిన ఈరోస్ సంస్థ... తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్ని బాషలకు కలిపి రూ. 400 కోట్ల ఆఫర్ తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


అంచనాలు పెంచిన టీజర్

అంచనాలు పెంచిన టీజర్

ఇప్పటికే విడుదలైన ‘సాహో' టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. బాహుబలి-2 సినిమాతో పాటు ఈ టీజర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు పబ్లిసిటీ కూడా బాగా పెరిగింది. యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్లో కలిపి ఈ టీజర్ కు కోటిన్నరకు పైగా హిట్స్ వచ్చాయంటే సినిమాపై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


150 కోట్ల బడ్జెట్

150 కోట్ల బడ్జెట్

సుజీత్ దర్శకత్వంలో 'సాహో' తెరకెక్కుతోంది, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూ. 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.సాబుసిరిల్, శంకర్ ఎహసాన్, లాయ్..

సాబుసిరిల్, శంకర్ ఎహసాన్, లాయ్..

అంతర్జాతీయ హంగులతో నిర్మిస్తున్న ప్రభాస్ చిత్రానికి శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మాదీ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నాడు. జాతీయ స్థాయికి, బాలీవుడ్‌కు తగినట్టు సంగీతం ఉండాలనే ఉద్దేశంతో సంగీత త్రయాన్ని రంగంలోకి దించాం. గతంలో దక్షిణాది చిత్రాలకు కూడా వారు సంగీతం అందించారు అని సుజిత్ పేర్కొన్నారు.


రూ. 35 కోట్లతో యాక్షన్ సీక్వెన్స్

రూ. 35 కోట్లతో యాక్షన్ సీక్వెన్స్

ఈ సినిమాలో కీలక సన్నివేశమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం రూ.35 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించేందుకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్‌ను రంగంలోకి దించారు. ఈ యాక్షన్ సీన్ల చిత్రీకరణ కోసం యూరప్‌లోని కొన్ని ప్రదేశాలను, అబుదాబీలోని కొన్ని లోకేషన్లలో తెరకెక్కిస్తున్నారు.English summary
Highly placed sources inform, As much as Rs 400 crore has been offered by a Bollywood production house for the theatrical rights of 'Saaho'. UV Creations is yet to accept this proposal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu