twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టెంపర్’....పూరి జగన్నాథ్‌కు ఎంత నష్టం?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘టెంపర్' చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఓవరాల్‌గా చూసుకుంటే వసూళ్లు బాగానే వచ్చాయి. నిర్మాతకు లాభాలు మిగిలాయి. అయితే ఈ చిత్రానికి గాను ఓ ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్న పూరి జగన్నాథ్ మాత్రం లాస్ అయ్యాడని అంటున్నారు.

    ఈ చిత్రానికి సంబంధించిన వెస్ట్ గోదావరి రైట్స్ రూ. 2.25 కోట్లకు పూరి సొంతం చేసుకున్నాడు. అయితే ఈ చిత్రం అక్కడ ఇప్పటి వరకు మొత్తం రూ. 1.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక వసూళు చేసే పరిస్థితి లేదని, ఆ ఏరియాలో ‘టెంపర్' బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయినట్లే అని అంటున్నారు. దీంతో పూరికి రూ. 75 లక్షల నష్టం వాటిల్లిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇతర ఖర్చులన్నీ కలుపుకుని దాదాపు 1 కోటి లాస్ అని అంటున్నారు.

    Rs 75 Lakh loss to Puri

    ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ ప్రారంభంలో బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లడంతో పాటు మంచి కలెక్షన్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తర్వాత వరల్డ్ కప్ రావటం, మరిన్ని అంతర్గత కారణాలతో సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయింది. రన్ స్లో అయ్యి...కలెక్షన్స్ చాలా చోట్ల డ్రాప్ అయ్యాయి. నైజాంలో బాగున్న కలెక్షన్స్ మిగతా ఏరియాల్లో ఆ స్ధాయిలో లేకపోవటం గమనించుకోవాల్సిన విషయం. ట్రేడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 42.35 కోట్లు కలెక్టు చేసినట్లు తెలుస్తోంది.

    కాజల్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

    English summary
    According to unit sources, Puri Jagannadh has bought the distribution rights of Temper of West Godavari from Bandla Ganesh for Rs 2.25 Crore. But the film managed to collect only Rs 1.5 Crore share incurring over Rs 75 Lakh loss to Puri. Including theatre rents, cost of Suresh productions through home Puri distributed, Puri has lost nearly Rs 1 Crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X