»   »  వాటాల్లో తేడా? పవన్ కళ్యాణ్ మళ్లీ చేయడంట!

వాటాల్లో తేడా? పవన్ కళ్యాణ్ మళ్లీ చేయడంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఏదైనా విషయంలో హర్ట్ అయితే ఆయన మళ్లీ అలాంటి విషయాల జోలికి వెళ్లరనే పేరుంది ఇండస్ట్రీలో. ఆయనకు క్లోజ్ అయితే మాత్రం వాళ్ల కోసం ఏదైనా చేస్తారాయన. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులు, దర్శకులు, నిర్మాతల విషయంలో పవన్ కళ్యాణ్ దృక్పథం నిక్కచ్చిగా ఉంటుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సినిమా ఆడినపుడు ఒకలా....ఆడక పోతే ఒకలా ప్రవర్తించే వ్యక్తులంటే ఆయనకు అస్సలు గిట్టదు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉంటారాయన. తనను కేవలం డబ్బులు సంపాదించి పెట్టే స్టార్ హీరోగా కాకుండా, ఒక మంచి ఆర్టిస్టుగా ట్రీట్ చేసే వాళ్లకే పవన్ కళ్యాణ్ ఎక్కువ విలువ ఇస్తారు.

Rumor about Pawan Kalyan

అదే సమయంలో తనను నమ్ముకుని ఉన్న వాళ్లకు ఏదైనా అన్యాయం జరిగినా ఆయన అస్సలు ఊరుకోరు. తన వల్ల అయింది చేస్తారు. ఇదంతా ఇపుడు ఎందుకు చెబుతున్నామంటే....తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న ఓ వార్త పవన్ ముక్కుసూటి తనానికి నిదర్శనమనే భావన కలిగిస్తోంది.

పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో ఇటీవల ‘గోపాల గోపాల' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల తర్వాత మంచి లాభాలు వచ్చాయి. అయితే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుండి శరత్ మరార్‌కు సంబంధించిన నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు రావాల్సిన లాభాల వాటాల్లో తేడా వచ్చిందని...తన స్నేహితుడికి అన్యాయం జరిగిందనే కోపంతో పవన్ కళ్యాణ్ ఇకపై సురేష్ ప్రొడక్షన్ సంస్థతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజా నిజాలు తేలియాల్సి ఉంది.

English summary
Film Nagar Rumor is that "Pawan Kalyan Will Not Work With Suresh Productions Again"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu