Just In
Don't Miss!
- News
కూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘సాహో’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు రెండు పండుగలు
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'సాహో'. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.
వాస్తవానికి 'సాహో'ను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, ఊహించని విధంగా ఈ సినిమాను వాయిదా వేశారు. టెక్నికల్ కారణాలతో పాటు రీ రికార్డింగ్ వల్ల సినిమాను 15 రోజులు వాయిదా వేశారు. అంటే.. ఆగస్టు 30న 'సాహో' విడుదల కాబోతుంది.

ఈ సినిమా విడుదల విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఆలస్యం అవడంతో వారంతా చిత్ర యూనిట్‌పై కోపంగా ఉన్నారు. దీంతో 'సాహో' టీమ్ సరికొత్త ప్లాన్ చేసిందట. అదేమిటంటే.. ఈ సినిమా ట్రైలర్‌ను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయాలని చూస్తుందని తెలుస్తోంది.
మొత్తం నాలుగు భాషల్లో అదే రోజున ట్రైలర్‌ను లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు, దీని కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేయాలా..? లేక మామూలుగానే విడుదల చేయాలా..? అన్న కోణాల్లో కూడా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ చేస్తే.. ఎవరెవరిని పిలవాలి అన్నట్లు కూడా మంతనాలు జరుపుతున్నారని ఫిలింనగర్‌లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగానే చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం చిత్ర పరిశ్రమలోని ఎంతో మందిని ఆహ్వానిస్తారని సమాచారం. ఈ వేడుకను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై క్లారిటీ వచ్చిన తర్వాత చిత్ర బృందం ప్రకటన చేయనుందని తెలుస్తోంది.