twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు తో మరోసారి సాయి ధరమ్ తేజ్: డైరక్టర్, టైటిల్?

    By Srikanya
    |

    హైదరాబాద్ : సాయి ధరమ్ తేజ కు తొలి హిట్ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు. ఆయన ‘పిల్లా.. నువ్వులేని జీవితం' చిత్రం నిర్మించి అతని కెరీర్ కు మంచి హిట్ ఇచ్చి లాంచ్ చేసారు. ఆ తర్వాత అదే ఊపులో ... ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి... ఇదే కాంబినేషన్ రిపీట్ అవబోతోందని సమాచారం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ‘శతమాన భవతి' అనే అచ్చతెలుగు టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. గతంలో ‘గబ్బర్ సింగ్', ‘రామయ్యా వస్తావయ్యా' సినిమాలకు స్క్రీన్‌ప్లే సహకారం అందించి, ప్రస్తుతం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రానికి పనిచేస్తున్న వేగేశ్న సతీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

    Sai Daram Tej-Dil Raju hattrick deal!

    'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రం విశేషాలకు వెళ్తే... సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాయికి మరో హిట్ అందిస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

    ''ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన 'రామయ్య వస్తావయ్యా' అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు'' అని 'దిల్' రాజు అన్నారు.

    'దిల్' రాజు మాట్లాడుతూ - ''సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి అమెరికాలో షూటింగ్ ఉంటుంది. వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు. '''మిరపకాయ్' టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను.

    అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. 'గబ్బర్‌సింగ్' టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది'' అని హరీశ్‌శంకర్ తెలిపారు.

    సాయిధరమ్‌తేజ్‌. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌ ఎస్‌

    English summary
    Satish Vegesna will be wielding the megaphone for Sai Dharam Tej-Dil Raju's hattrick movie. He has got the experience of working in the script department for 'Gabbar Singh' and 'Ramayya Vastavayya'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X