మెగా హీరో సినిమా ఓటీటీ రిలీజ్.. సల్మాన్ ఖాన్ రూట్లోనే..
సెకండ్ వేవ్ దెబ్బకు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా చాలా సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. ఇక వచ్చే ఏడాది వరకు థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదని మరికొన్ని సినిమాల నిర్మాతలు కూడా డిజిటల్ ఆఫర్స్ కు ఓకే చెప్పేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా టాలీవుడ్ లో షూటింగ్ పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాల సంఖ్య పదికి పైగానే ఉంది.
ఇక షూటింగ్ ముగింపు దశాల్లో ఉన్న సినిమాలు కూడా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక కొందరు పే పర్ వ్యూ పద్దతిలో సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ రాధే సినిమాను అదే తరహాలో రిలీజ్ చేశారు. ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా కూడా అదే తరహాలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న రిపబ్లిక్ సినిమా ఆల్ మోస్ట్ రిలీజ్ కు రెడీ అయ్యింది.

సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే ఈపాటికే థియేటర్స్ లోకి వచ్చి ఉండేది. ఇక ఈ సినిమా డిజిటల్ ఓటీటీ హక్కులన జీ సంస్థ సొంతం చూసుకుంది. ఇక థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం లేదని జీ5 లోనే డైరెక్ట్ గా పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా క్లిక్కయితే ఆ వెంటనే మరికొన్ని తెలుగు సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీలో విడుదల కావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











