»   » పవన్ కళ్యాణ్ ని రప్పించడం కోసం గట్టి ప్రయత్నం..పవర్ స్టార్ కరుణిస్తాడా..!

పవన్ కళ్యాణ్ ని రప్పించడం కోసం గట్టి ప్రయత్నం..పవర్ స్టార్ కరుణిస్తాడా..!

Subscribe to Filmibeat Telugu
అనుపమ పరమేశ్వరన్ తో రొమాన్స్, పవర్ స్టార్ కరుణిస్తాడా..!

పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాల్లో నటిస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన అధిపతిగా రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ పలు నిర్మాణ సంస్థలతో సినిమా చేయడానికి గతంలో ఒప్పందం కుదుర్చుకుని ఉన్నాడు.కనీసం పవన్ కళ్యాణ్ ఒక్క చిత్రంలో అయినా నటిస్తాడా లేదా తెలియాలంటే పవర్ స్టారే స్వయంగా వెల్లడించాలి. ఇదిలా ఉండగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విషయంలో తేజు చిన్న మావయ్య సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

 పాలిటిక్స్ లో బిజీ బిజీగా

పాలిటిక్స్ లో బిజీ బిజీగా

అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గతంలో కొందరు నిర్మాతలకు కమిట్ మెంట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరో చిత్రం లో నటించే మూడ్ లో కనిపించడం లేదు.

 మరో సినిమా కష్టమే

మరో సినిమా కష్టమే

పూర్తి స్థాయి రాజకీయాలతో పవన్ కళ్యాణ్ బిజీగా మారదు కాబట్టి పవర్ స్టార్ నుంచి ఇంకొక సినిమా ఆశించడం కష్టమే. అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ మరో సినిమాకు సంబంధించి ఎటువంటి వార్త బయటకు రాలేదు.

కష్టాల్లో మేనల్లుడు

కష్టాల్లో మేనల్లుడు

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుస పరాజయాలతో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురుకొంటున్నాడు.

లాంచ్ చేసింది పవనే

లాంచ్ చేసింది పవనే

సాయిధరమ్ తేజ్ డెబ్యూ మూవీ రేయ్ చిత్రం ఇబ్బందుల్లో ఉంటె పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఆ చిత్రాన్ని విడుదల చేయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రేయ్ చిత్ర విడుదలలో పవన్ సహకారం మరువలేనిది అని పలు సందర్భాల్లో ఆ చిత్ర దర్శకుడు వైవిఎస్ చౌదరి వెల్లడించారు.

 కరుణాకరన్ దర్శకత్వంలో

కరుణాకరన్ దర్శకత్వంలో

సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ప్రేమకథ చిత్రంలో నటిస్తున్నాడు. తేజు ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి.

 పవన్ ని రప్పించడం కోసం

పవన్ ని రప్పించడం కోసం

పవన్ సహకారం ఉంటె సినిమాకు బలం చేకూరే అవకాశం ఉంది. దీనితో సాయిధరమ్ తేజ్ చిన్న మావయ్యని ఈ చిత్ర ఆడియో వేడుకకు రప్పించాహడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆడియో వేడుకుకు ఇంకా చాలా సమయం ఉన్నపటికీ పవన్ కళ్యాణ్ కు ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా తేజు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

తేజుని మందలించినట్లు వార్తలు

తేజుని మందలించినట్లు వార్తలు

తేజు చివరగా నటించిన చిత్రం ఇంటెలిజెంట్. ఈ చిత్రం పరాజయం చెందింది. ఈ చిత్ర విడుదల తరువాత పవన్ కళ్యాణ్ తేజని పిలిచి మందలించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సరైన కథలు ఎంపిక చేసుకోవాలని, కేరీర్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం జరిగింది.

 అనుపమతో తొలిసారి

అనుపమతో తొలిసారి

ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ తొలిసారి అనుపమ పరమేశ్వరన్ తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రేమకథలు స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుండంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

English summary
Sai dharam Tej wants Pawan Kalyan help. Now Sai dharam tej is action under Karunakaran movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu