»   » చెర్రీ తో అనుకుంటే సాయి ధరమ్ తేజని సీన్ లోకి తెచ్చి షాకిస్తున్న పవన్

చెర్రీ తో అనుకుంటే సాయి ధరమ్ తేజని సీన్ లోకి తెచ్చి షాకిస్తున్న పవన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ ప్రక్కన నటుడుగా సినిమాలు మరో ప్రక్కన పొలిటికల్ కమిటిమెంట్స్ తో బిజీగా ఉన్న పవన్ త్వరలో నిర్మాతగా కూడా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి నితిన్, కృష్ణ చైతన్య చిత్రం ఇప్పటికే మొదలెట్టిన పవన్ తన తదుపరి చిత్రంకు కూడా రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం... పవన్ , త్రివిక్రమ్ బ్యానర్ లో వచ్చే తదుపరి చిత్రం సాయి ధరమ్ తేజతో ఉండనుంది. గతంలో రామ్ చరణ్ తో సినిమా చేస్తానని ప్రకటించిన పవన్ ఇలా యుటర్న్ తీసుకుని, మెగా మేనల్లుడు సాయిని సీన్ లోకి తీసుకు రావటం మెగా క్యాంప్ లో షాక్ ఇచ్చింది.

అయితే మొదట రామ్ చరణ్ తో సినిమా అనుకున్నా...సాయి ధరమ్ తేజ వరస ఫ్లాఫ్ లతో కెరీర్ స్టక్ అవటంతో ఆందోళన చెందిన పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. మొదటి నుంచీ సాయి ధరమ్ తేజ ని నిలబెట్టేందుకు పవన్ కృషి చేస్తూ వస్తున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, బడ్జెట్ ఎంత అనే విషయాలు మాత్రం తెలియరాలేదు.

ఇక పవన్ తాజా చిత్రం 'కాటమరాయుడు' సాంగ్ రిలీజ్ అయ్యి దుమ్ము రేపుతోంది అయింది. 'రాయుడూ..' అంటూ ఇటీవల టీజర్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'మిరామిరా మీసం.. మెలి తిప్పాడు జన కోసం' అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పంచె కట్టి, చేతిలో కత్తిపట్టి, మీసం మెలేసి రంగంలోకి దిగిన 'కాటమరాయుడు' జనం కోసం ఏం చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అనే ఆసక్తిని ఆ సాంగ్ రేపుతోంది.

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. శ్రుతిహాసన్‌ హీరోయిన్. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌మరార్‌ నిర్మాత. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. ప్రతీ రెండు రోజులకూ ఓ పాట విడుదలవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో పవన్‌, శివ బాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, నాలుగొందల మంది డాన్సర్లపై ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూనే మార్చి 18న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించనున్నారు. ఈ వరుస విశేషాలతో మార్చి నెల మొత్తం పవన్ అభిమానులకు పండుగలా మారనుంది.
ఈ పాట‌తోనే ప్ర‌మోష‌న్ల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ప్ర‌తీ రెండు రోజుల‌కూ ఓ పాట‌గానీ, మేకింగ్ వీడియో గానీ విడుద‌ల చేస్తారు.

శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
Pawan’s next home production might feature his nephew Sai Dharam Tej.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu