For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సాయి పల్లవి లక్కు మామూలుగా లేదు.. లాక్ డౌన్‌లో భారీగా అడ్వాన్సులు, ఆదాయం ఎంతంటే?

  |

  సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ గ్లామర్ ప్రజెంటేషన్ పై ఎందరో మహానుభావులు పెదవి విరిశారు. అయితే అవకాశాలు రావాలంటే ఆ మాత్రం ఉండకపోతే ఎలా అని మరికొందరు సమాధానం ఇస్తే.. మా ఇష్టం అన్నట్లు మరికొందరు పెదవి విరిశారు. అయితే సాయి పల్లవి మాత్రం మాటలతో కాకుండా టాలెంట్ మాత్రమే ఒక మంచి గుర్తింపును అందిస్తుందని చేసి చూపించింది. అలాగే వరుసగా అవకాశాలు కూడా అందుకుంటోంది.

  సాయి పల్లవి అందంపై సెటైర్స్

  సాయి పల్లవి అందంపై సెటైర్స్

  మలయాళం ప్రేమమ్ సినిమా పోస్టర్ చూసినప్పుడు చాలా మంది సాయి పల్లవి అందంపై సెటైర్స్ కూడా వేశారు. కానీ ఆమె తన నటనతో విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది. ఇక ఫిదా సినిమాతో తెలుగు రాకపోయినా సొంతంగా డబ్బింగ్ కోసం నేర్చుకొని తన పట్టుదలను బయటపెట్టింది. ఇక ఆమె డ్యాన్స్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. రౌడి బేబి సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

  రెమ్యునరేషన్ కోసం ఆశపడకుండా

  రెమ్యునరేషన్ కోసం ఆశపడకుండా

  సాయి పల్లవి ఫిదా తరువాత ఒక్కసారిగా పదుల సంఖ్యలో అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె రెమ్యునరేషన్ కోసం ఆశపడకుండా అనవసరమైన కథలను రిజెక్ట్ చేసింది. ఇక కొన్ని సినిమాల్లో గ్లామర్ పాత్రలో డోస్ పెంచాలని అన్నప్పుడు ఆ విధంగా ఉండడం నాకు నచ్చదు అంటూ అడ్వాన్స్ సైతం వెనక్కి ఇచ్చేసింది. ఇక ఆ మంచి నిర్ణయాలే సాయి పల్లవికి మంచి క్రేజ్ అందించింది.

  ఆ సినిమాలతో బిజీగా

  ఆ సినిమాలతో బిజీగా

  ఇక లాక్ డౌన్ లో ఆమె టాలెంట్ కి లక్కు కూడా తొడయ్యింది. అందుకే వరుసగా అవకాశాలు అందుకుంది. శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ సినిమా ఏండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక గత ఏడాది మొదలైన విరాటపర్వం సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటోంది. ఇక త్వరలో మెగాస్టార్ చిరంజీవి వేదళం రీమేక్ లో కూడా సిస్టర్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

  సాయి పల్లవి ఆదాయం ఎంతంటే..

  సాయి పల్లవి ఆదాయం ఎంతంటే..

  సాయి పల్లవి రెమ్యునరేషన్ కోటిన్నర నుంచి 2కోట్ల రూపాయల వరకు ఉంటుందని చాలా రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ లెక్కన చూస్తే ఈ ఏడాది అమ్మడు 8కోట్లకు పైగా ఆదాయాన్ని వేనకేసుకున్నట్లు తెలుస్తోంది. నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనున్న సాయి పల్లవి శర్వానంద్ తో కూడా ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలనే కాకుండా తమిళ్ లో రెండు ప్రాజెక్టుల కోసం అడ్వాన్సులు కూడా అందినట్లు టాక్ వస్తోంది.

  Mega Hero 'Solo Brathuke So Better' Movie Releasing In OTT
  యాడ్స్ లలో నటించే అవకాశం వచ్చినా ఒప్పుకోలేదు

  యాడ్స్ లలో నటించే అవకాశం వచ్చినా ఒప్పుకోలేదు

  కొన్ని సినిమాలకు తన రేంజ్ కి తగ్గట్లు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా కూడా కథ మీద నమ్మకంతో, గౌరవంతో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి అనుకుంటే చాలా యాడ్స్ లలో కూడా నటించవచ్చు. ఒక ఫెయిర్ నెస్ క్రీమ్ కంపెనీకి యాడ్ చేసే అవకాశం రాగా అది మన ఒరిజినల్ కలర్ ని కించే పరిచేలా ఉంటుందని రిజెక్ట్ చేసిందట. అలాగే జనాలను మోసం చేసే యాడ్స్ కూడా చేయనని ఈ బ్యూటీ సరికొత్త అడుగులు వేస్తోంది.

  English summary
  Sai pallavi’s ongoing period drama, Virata Parvam 1992. A major part of the shooting has been wrapped and the remaining portions will be completed soon after the lockdown gets lifted.Now, Priyamani revealed in a latest interview that she is essaying the role of a naxalite in Virata Parvam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X