»   » మరో తెలుగు సినిమాకు సాయి పల్లవి డబ్బింగ్?

మరో తెలుగు సినిమాకు సాయి పల్లవి డబ్బింగ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫిదాలో స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పిన హీరోయిన్ సాయి పల్లవి, మరోసారి తెలుగులో డబ్బింగ్ చెప్పబోతోందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి నటించిన మళయాల చిత్రం 'కలి' తెలుగులో డబ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కు గానూ ఆమెను డబ్బింగ్ చెప్పమని అడుగుతున్నట్లు తెలుస్తోంది.

'ఫిదా'కు సాయి పల్లవి చెప్పిన డబ్బింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అలాగే 'కలి' తెలుగు వెర్షన్ కు కూడా ఆమె డబ్బింగ్ చెప్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఆ కోరిక తీరుతుందో? లేదో?


Sai Pallavi's Kali in Telugu

దుల్కర్‌ సల్మాన్‌, సాయిపల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రం 'కలి'. ఈ చిత్రం తెలుగులో విడుదల కాబోతోంది. అనువాద హక్కులను డి.వి. కృష్ణస్వామి దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు అనువాదానికి సంబంధించిన డబ్బింగ్‌, మిక్సింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా టైటిల్‌, లోగోను విడుదల చేయనున్నట్లు తెలిపింది. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది.


గోపీసుందర్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సమీర్‌ తాహీర్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన 'ఫిదా'తో సాయిపల్లవి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం ఆమె నానితో కలిసి 'ఎం.ఎల్‌.ఎ' చిత్రంలో నటిస్తున్నారు. 'ఓకే బంగారం'తో దుల్కర్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ప్రస్తుతం ఆయన 'సావిత్రి'లో నటిస్తున్నారు.


Sai Pallavi Dubbing For One More Telugu Movie
English summary
Malayalam hit 'Kali' is getting dubbed into Telugu. The movie's rights have been acquired by DV Krishna Swamy and he will release the film on Lakshmi Chennakesava Films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu