For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా ప్రాజెక్ట్‌లో సల్మాన్ ఖాన్... చిరంజీవికి గాడ్‌ ఫాదర్‌గా కండలవీరుడు!

  |

  అదేంటది మెగాస్టార్ చిరంజీవితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమానా ? వినడానికి భలే ఎగ్జైటింగ్ గా ఉంది కదూ.. అవును నిజమే వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా కోసం పని చేయబోతున్నారు. ఆ సినిమా ఏంటి ? సినిమాలో ఎవరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి ? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  ఎక్కడా తగ్గేదిలేదు

  ఎక్కడా తగ్గేదిలేదు

  తెలుగు వారికి చిరంజీవి అంటే అదో రకమైన పిచ్చి. చిరంజీవి ఫ్యాన్ బేస్ అంటే ఎవరూ ఊహించనటువంటిది.. ఒకప్పుడు ఎన్ టీ ఆర్ ఆ తర్వాత చిరంజీవి తెలుగు సినిమా రంగాన్ని ఏలారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అనూహ్యంగా చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడం ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వంటి పరిణామాలతో చాలా మంది చిరంజీవి అభిమానులు కూడా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.. కానీ తనకు రాజకీయాలు సెట్ కావు అనే విషయం తెలుసుకున్న చిరంజీవి అతి కొద్ది కాలంలోనే మళ్లీ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150 లాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మళ్లీ తన ఫ్యాన్ బేస్ ఏమాత్రం చెక్కు చెదరలేదు అనే విషయం అర్థం చేసుకున్నారు.

  పాన్ ఇండియా ప్లాన్

  పాన్ ఇండియా ప్లాన్


  ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన అప్పుడే ఫ్యాన్ ఇండియా లెవెల్ మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఆయన చివరి సినిమా సైరా నరసింహారెడ్డి కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తప్ప మిగతా చోట్ల పెద్దగా కలెక్షన్లు తెచ్చుకోలేక పోయింది. అలాగే సినిమా అక్కడి ప్రేక్షకులను కూడా రీచ్ కాలేకపోయింది అనే చెప్పాలి. సో పాన్ ఇండియా సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలని భావిస్తున్నారు చిరంజీవి. దానికి సంబంధించిన అనేక సాధ్యాసాధ్యాల మీద ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో బిజీగా ఉన్నారు.

  ఆచార్యలో బిజీబిజీగా

  ఆచార్యలో బిజీబిజీగా

  అపజయం ఎరగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఆచార్య సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ తేజ్ కూడా సినిమా మీద అంచనాలు పెరగడానికి కారణం అవుతున్నారు. ఈ సినిమాలో మొదట ఆయన పాత్ర చిన్నది అని ప్రచారం జరిగినా ఆయన కోసం పూజ హెగ్డే ని కూడా సినిమాలో భాగం చేయడంతో ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కూడా పెద్దదే అనే సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. కేవలం రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయని మిగతా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందని కూడా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ నటించబోయే సినిమా మాత్రం చిరంజీవి 153వ సినిమా.

  ఆ సినిమాలో గాడ్ ఫాదర్ గా

  ఆ సినిమాలో గాడ్ ఫాదర్ గా

  చిరంజీవి 153వ సినిమా మరేమిటో కాదు మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమా రీమేక్.. ముందు నుంచి ఈ సినిమా కథ చాలా మంది దర్శకుల దగ్గర నానింది. ముందుగా సాహో దర్శకుడు సుజిత్ సినిమా దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు వినాయక్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. అటునుండి చివరకు ఈ సినిమా తమిళ దర్శకుడు మోహన్ రాజా చేతికి చిక్కింది. ప్రచారాలు కాకుండా నేరుగా ఈ సినిమా దర్శకుడు ఆయనే అని స్వయంగా సినిమా నిర్మాణ సంస్థ కూడా ప్రకటించింది. ఈ సినిమా మీద ఫ్యాన్ ఇండియా లెవల్లో మార్కెట్ చేయాలని భావిస్తున్న దర్శకనిర్మాతలు ఈ సినిమా కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

  ఆ హీరో పాత్రలో

  ఆ హీరో పాత్రలో

  ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నారని తెలుస్తోంది.. పాత్ర చిన్నదే అయినా సినిమా మొత్తాన్ని ప్రభావితం చేసే పాత్ర కావడంతో ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ ప్రభావం సినిమా మీద పడుతుందని దర్శక నిర్మాతలతో పాటు చిరంజీవి కూడా భావిస్తున్నారు. బహుశా మరేదైనా హీరో అడిగితే కాదనే వారు ఏమో తెలియదు గానీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కోరడంతో తమ మధ్య ఉన్న అనుబంధం రీత్యా సల్మాన్ ఖాన్ నప్ చెప్పలేదని కచ్చితంగా సినిమాలో నటిస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాకి గాడ్ ఫాదర్ అనే పేరు ప్రచారం జరుగుతూ ఉండగా కేవలం పది నిమిషాల పాటు ఉండే పాత్రలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నారని తెలుస్తోంది. లూసిఫర్ ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ పాత్రలో నటించారు. మోహన్ లాల్ కి అవసరమైన సమయంలో పృథ్వీరాజ్ సుకుమారన్ రంగంలోకి దిగి పని పూర్తి చేస్తుంటారు. అలా సినిమా మొత్తం మీద చూసినా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు పది నిమిషాల నిడివి కనిపించదు.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
  హిందీలో కూడా రచ్చరచ్చే

  హిందీలో కూడా రచ్చరచ్చే


  ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను తెలుగులో పోషించబోతున్నారు అని అంటున్నారు. సల్మాన్ ఖాన్ చిరంజీవి కుటుంబాల మధ్య చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రామ్ చరణ్ స్వయంగా జంజీర్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు కూడా సల్మాన్ ఖాన్ ఆ సినిమాకి తన సంపూర్ణ మద్దతు తెలియజేయడమే కాక ఈ సినిమా ప్రమోషన్ కూడా చేశాడు. కేవలం చిరంజీవితో ఉన్న అనుబంధం రీత్యా ఈ సినిమా సల్మాన్ ఖాన్ ఒప్పుకున్నారు అని అంటున్నారు. ఆయన కనుక ఈ పాత్రలో నటిస్తే హిందీలో కూడా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కావడం తథ్యం. అలా మెగాస్టార్ తమ పాన్ ఇండియా మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం అయితే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఇక గాడ్ ఫాదర్ గా ప్రస్తుతానికి సంబోధించబడుతున్న ఈ సినిమాను ఎం వి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

  English summary
  Rumours arising that Salman Khan is likely to play key role in Lucifer Telugu remake starring Chiranjeevi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X