»   » ఫ్లాష్ బ్యాక్: ఆ హీరోయిన్ వల్లే సల్మాన్ తప్పతాగి, యాక్సిడెంట్ చేసారా?

ఫ్లాష్ బ్యాక్: ఆ హీరోయిన్ వల్లే సల్మాన్ తప్పతాగి, యాక్సిడెంట్ చేసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2002, సెప్టెంబర్, 28లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో దాదాపు 13 ఏళ్ల విచారణ అనంతరం ఈరోజు తుది తీర్పు వెలువడింది. మద్యం తాగి వాహనం నడిపి ఒకరి ప్రాణాలు పోవడానికి, నలుగురు గాయపడటానికి కారణమయ్యాడని సల్మాన్ ఖాన్ మీద అభియోగాలు రుజువు కావడంతో ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

కోర్టు అతన్ని దోషిగా తేల్చినా...సల్మాన్ మాత్రం నేను నిర్దోషినే అంటూ వాదించారు. సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చివరగా నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తే....నేను కారు నడపలేదు. నాపై మోపిన అభియోగాలు అబద్దం అంటూ మరోసారి కోర్టుకు వెల్లడించారు. సల్మాన్ కు శిక్ష పడిన వెంటనే బెయిల్ కోసం బాంబే హైకోర్టు ఆశ్రయించడం, రెండు రోజుల బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది.

అసలు సల్మాన్ ఖాన్ కారు ఎందుకు నడిపారు? ఆ సమయంలో డ్రైవర్ ఎటు వెళ్లారు? అనే విషయాలు ఆరా తీస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.......అప్పట్లో సల్మాన్ ఖాన్ ప్రేమించిన ఓ స్టార్ హీరోయిన్ మూల కారణమని తెలుస్తోంది. ఈ సంఘటన చోటు చేసుకున్న 13 ఏళ్ల క్రితం మీడియాలో వార్తలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

అప్పట్లో సల్మాన్ ఖాన్ ఓ స్టార్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉండేవారు. సదరు హీరోయిన్ ఇప్పటికీ తన తన హవా కొనసాగిస్తోంది. అందాల సుందరిగా నీరాజనాలు అందుకుంటోంది. ప్రేమికులన్నాక గొడవలు మామూలే. ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో ఆమె మరో హీరో(తెలుగు ఫ్యాక్షన్ సినిమాలో నటించాడు)తో క్లోజ్ గా ఉండటం చూసిన సల్మాన్ ఖాన్ తట్టుకోలేక పోయాడట. వారిద్దరితో గొడవ పడ్డారట.

 Salman Khan Convicted; Gets Five Years In Jail

ఈ గొడవతో డిసప్పాయింట్ అయిన సల్మాన్ ఖాన్ తన సోదరుడు సొహైల్ ఖాన్, సింగర్ కమాల్ ఖాన్, మరికొందరు మిత్రులతో కలిసి బాంద్రా హిల్ రోడ్డులోని జేడబ్ల్యు మారియట్ హోటల్ కు వెళ్లినట్లు, అందులోని రెయిన్ బార్ లో పీకల్లోతు తాగినట్లు, అనంతరం రాత్రి రెండు గంటల సమయంలో తానే స్వయంగా తన ల్యాండ్ క్రూయిజర్ కారుకు నడుపుకుంటూ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు అప్పట్లో మీడియా కథనాలు వెలువడ్డాయి. కారు అదుపు తప్పడంతో బాంద్రారోడ్డులోని అమెరికన్ ఎక్స్ ప్రెస్ బేకరీలోకి కారు దూసుకెళ్లింది. ఆ సమయంలో బేకరీముందు ఫుట్ పాత్ మీద పడుకున్న బేకరీ ఉద్యోగి ఒకరు మరణించారు.నలుగురు గాయపడ్డారు. పోలీసు డిపార్టు మెంటు తరుపున సల్మాన్ ఖాన్ కు బాడీగార్డుగా ఉన్న రవీంద్ర పాటిల్ మీరు ఎక్కువ తాగారు, కారు నడపొద్దు అని చెప్పినా సల్మాన్ ఖాన్ వినిపించుకోలేదు. యాక్సిడెంట్ అనంతరం సల్మాన్, అతని స్నేహితులు కారు అక్కడే వదిలి వెళ్లి పోయారు.

వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ప్రత్యక్ష సాక్షును విచారించి సల్మాన్ ఖాన్ ను అదే రోజు అరెస్టు చేసారు. అతని బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షించారు. అక్టోబర్ 1న సల్మాన్ ఖాన్ బెయిల్ మీద విడుదలయ్యారు. అప్పటి నుండి వివిధ మలుపులు తిరిగిన ఈ కేసు 13 ఏళ్ల అనంతరం నేడు విచారణ పూర్తయి తుది తీర్పు వెలువడింది.

English summary
Bollywood actor Salman Khan was on Wednesday sentenced to five years in jail for a 2002 hit-and-run accident that left one man dead and four others injured. Additional Sessions Judge D.W. Deshpande announced the verdict at a packed court. Earlier, the actor was found guilty on most of the charges levelled against him in the incident that took place in suburban Bandra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu