»   » సల్మాన్ మరో తెలుగు హిట్ రీమేక్ లో? సూటవతుందా?

సల్మాన్ మరో తెలుగు హిట్ రీమేక్ లో? సూటవతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :సల్మాన్ ఖాన్ అంటేనే రీమేక్ ల స్పెషలిస్ట్. ఆయన భాషా భేధం లేకుండా తమిళ,తెలుగు, మళయాళ రీమేక్ లు యధేచ్చగా చేస్తూంటారు. వాటిలో కొన్ని ఫ్లాప్ అయినా పోకిరి, రెడీ వంటి రీమేక్ లు సూపర్ హిట్ అయ్యాయి.

దానికి తోడు ఆయన రీసెంట్ హిట్ భజరంగి భాయిజాన్ కు కథ ఇచ్చింది మన తెలుగు రైటర్ విజయేంద్ర ప్రసాద్. దాంతో సల్మాన్ ఎప్పుడూ ఓ కన్ను ఇక్కడ వేసుంచుతారు. ఇక్కడ రీమేక్ పై వెంటనే ఓ కర్చీప్ వేసేస్తాడు. అలాగే సల్మాన్ తాజాగా ఓ తెలుగు చిత్రం రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు... క్షణం


Also Read: సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ టాపిక్: డబ్బుకోసం ఇంతకు తెగిస్తారా?


ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని సాజిద్ నిడియవాలా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన సల్మాన్ ఖాన్ కు ఈ చిత్రం చూపించి ఓకే చేయించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ఈ లో బడ్జెట్ చిత్రం రీమేక్ కు ఫెరఫెక్ట్ గా సూటవుతాడని భావిస్తున్నారు.


హిందీకు అందునా పెద్ద స్టార్ చేస్తే కొన్ని మార్పులు ఖచ్చితంగా చేస్తారు. అయితే పాటలు, కామెడీ బిట్స్ వంటివి కలిపితే సినిమా నిలబడుతుందా, లేక హిందీలోనూ తెలుగులాగే యాజటీజ్ స్క్రీన్ ప్లేను ఫాలో అయిపోతారా అనేది తెలియాల్సి ఉంది. అంతేనా..హిందీకు సల్మాన్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ ని, అదా శర్మ పాత్రకు అడిగితే బాగుంటుందనే ఆలోచన కూడా నిర్మాతలకు ఉందిట. అదీ సంగతి.


సల్మాన్ గతంలో చేసన రీమేక్ లు ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటే....


వెంకీ ప్రేమ

వెంకీ ప్రేమ

వెంకటేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ప్రేమ చిత్రాన్ని అదే దర్శకుడు సురేష్ కృష్ణ హిందీలో లవ్ అనే టైటిల్ తో సల్మాన్ తో చేసాడు.హమ్ ఆప్ కి హై కౌన్

హమ్ ఆప్ కి హై కౌన్

సల్మాన్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం గతంలో ఇదే బ్యానర్ లో వచ్చిన నదియా కీ ప్యార్ (1982) అనే చిత్రానికి రీమేక్ .జుద్వా

జుద్వా

నాగార్జున సూపర్ హిట్ హలో బ్రదర్ కు రీమేక్ ఇది. హిందీలోనూ పెద్ద హిట్టైంది.బీవీ నెంబర్ వన్

బీవీ నెంబర్ వన్

హిందీలో పెద్దగా ఆడని ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో రిలీజైన సతీ లీలావతికి రీమేక్హాలీవుడ్ రీమేక్

హాలీవుడ్ రీమేక్

హాలీవుడ్ లో వచ్చిన ది వెడ్డింగ్ సింగర్ ని మక్కీకి మక్కీ దింపుతూ వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పాటలు మాత్రం పెద్ద హిట్.క్యోంకి

క్యోంకి

మోహన్ లాల్ మళయాళంలో నటించిగా సూపర్ హిట్టైన తాళవట్టం కు అపీషియల్ రీమేక్. హిందీలో ఆడలేదు. నటనకు మంచి పేరు వచ్చింది.తేరీ నామ్

తేరీ నామ్

తెలుగులో రాజశేఖర్ చేసిన శేషు, తమిళంలో విక్రమ్ చేసిన సేతుల రీమేక్ ఇది. పెద్ద హిట్టై ఆ సంవత్సరం హైయిస్ట్ గ్రాసర్ గా నిలిచింది.వాంటెడ్

వాంటెడ్

మహేష్ కెరీర్ లో పెద్ద హిట్టైన పోకిరి చిత్రాన్ని హిందీలో వాంటెడ్ అని ప్రభుదేవా తెరకెక్కించాడు. అక్కడ నుంచే సల్మాన్ హవా మళ్లీ మొదలైంది.రెడీ

రెడీ

రామ్,శ్రీను వైట్లకాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం హిందీలోనూ రీమేక్ అయ్యి పెద్ద హిట్టైందిబాడీ గార్డ్

బాడీ గార్డ్

వెంకటేష్ తెలుగులో చేసిన బాడీగార్డ్ గుర్తుందా..దాని ఒరిజనల్ మళయాళం. అక్కడ నుంచి రైట్స్ తీసుకుని అదే దర్శకుడుతో సల్మాన్ చేసాడు. అక్కడా బాగా ఆడింది. సల్మాన్ తొలి వందకోట్ల సినిమా ఇది


కిక్

కిక్

రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన కిక్ సినిమాని అదే పేరుతో సల్మాన్ కిక్ అని రీమేక్ చేసి హిట్ కొట్టారు.జైహో

జైహో

తెలుగులో వచ్చిన స్టాలిన్ కురీమేక్ గా తెరకెక్కిన చిత్రం జైహో ..ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.ఫ్రీమేక్ లు

ఫ్రీమేక్ లు

సల్మాన్ ఇలా రైట్స్ కొని సినిమా లు చేయటమే కాకుండా...వేరే చోట హిట్టైన కాన్సెప్టులు, సినిమాలను ఫ్రీ మేక్ చేసి హిట్ కొడుతూండటం అలవాటే..పోస్టర్స్ కూడా

పోస్టర్స్ కూడా

సల్మాన్ ఖాన్ సినిమాలే కాదు పోస్టర్స్ కూడా ఎక్కడో చోట నుంచి తీసుకుంటాడని అంటూంటారు.ఏక్తా టైగర్

ఏక్తా టైగర్

ఏక్తా టైగర్ పోస్టర్ కాపీ అంటూ అప్పట్లో పెద్ద దుమారమే రేగిందిక్షణం

క్షణం

సల్మాన్ ఖాన్ మరి ఈ రీమేక్ లో ఎలా కనిపించనున్నాడో చూడాలి.English summary
Tollywood recent blockbuster Kshanam remake going to made by Sajid Nadiadwala and there is a good chance that Salman might also say yes to it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu