»   » చరిత్ర సృష్టించిన సల్మాన్ ‘ట్యూబ్‌లైట్’, రికార్డు ధరకు రైట్స్

చరిత్ర సృష్టించిన సల్మాన్ ‘ట్యూబ్‌లైట్’, రికార్డు ధరకు రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ట్యూబ్‌లైట్ విడుదలకు ముందే భారతీయ సినిమా చరిత్ర రికార్డులను తిరగరాసిన్నట్టు సమాచారం. ట్యూబ్ లైట్ పంపిణీ హక్కులు రూ.130 కోట్లకు అమ్ముడపోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఇదే వాస్తవమైతే ఇప్పటివరకు ఇదే ఇండస్ట్రీ రికార్డు.

దిల్‌వాలే రికార్డు బ్రేక్

దిల్‌వాలే రికార్డు బ్రేక్

2015లో షారుక్ ఖాన్ నటించిన దిల్‌వాలే చిత్ర పంపిణీ హక్కులు రూ.125 కోట్లకు అమ్ముడుపోయాయి. ఆ రికార్డును తాజాగా ట్యూబ్‌లైట్ బ్రేక్ చేసిన్నట్టు తెలిసింది. ట్యూబ్‌లైట్ చిత్రం రంజాన్‌కు విడుదల కానున్నది. ఈ హక్కులను ఫాక్స్ స్టార్ దక్కించుకొన్నట్టు తెలుస్తున్నది.

ఇండో, చైనా యుద్దం నేపథ్యంగా

ఇండో, చైనా యుద్దం నేపథ్యంగా

ట్యూబ్‌లైట్ చిత్రం పిరియాడిక్ డ్రామాగా రూపుదిద్దుకొంటున్నది. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధ నేపథ్యంగా తెరకెక్కుతున్నది. ఇది పక్కాగా ప్రేమ కథా చిత్రం.

అతిథి పాత్రలో షారుక్

అతిథి పాత్రలో షారుక్

భారత్‌కు చెందిన ఓ యువకుడు, చైనాకు చెందిన యువతి ప్రేమలో పడుతారు. భారత, చైనా యుద్దంలో వారు ఎలాంటి పరిస్థుతులను ఎదుర్కొన్నారనే కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అతిథి పాత్రను పోషిస్తున్నట్టు డైరెక్టర్ కబీర్ ఖాన్ వెల్లడించారు.

సల్మాన్‌తో కబీర్ మూడోసారి

సల్మాన్‌తో కబీర్ మూడోసారి

ట్యూబ్‌లైట్ చిత్రానికి దర్శకుడు కబీర్ ఖాన్. సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాలకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఏక్ థా టైగర్ రూ.198 కోట్లు, భజరంగీ భాయ్ జాన్ రూ.320 కోట్లు వసూలు చేశాయి.

బాలీవుడ్‌లోకి చైనా నటి

బాలీవుడ్‌లోకి చైనా నటి

ఈ చిత్రంలో చైనా నటి జూజూ, దివంగత ఓంపూరి, మహ్మద్ జీషాన్, సోహైల్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2017 జూన్ 23వ తేదీన విడుదల కానున్నది.

సిద్ధమవుతున్న టైగర్ జిందా హై

సిద్ధమవుతున్న టైగర్ జిందా హై

ట్యూబ్‌లైట్ చిత్రం కాకుండా సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కథానాయిక. ఈ చిత్రం ప్రస్తుతం ఆస్ట్రియాలో షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ చిత్రం ఏడాది డిసెంబర్‌లో విడుదల కానున్నది.

English summary
Tubelite film sold at an unbelievable price of 130 crores. Apparently, this has now even broken the record of Shah Rukh Khan’s Dilwale, which was sold at a towering 125 crores in 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu