»   »  ఆ హీరోయిన్ ఓకే అయింది, ఎన్టీఆర్ లో గుబులు మొదలైంది?

ఆ హీరోయిన్ ఓకే అయింది, ఎన్టీఆర్ లో గుబులు మొదలైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెతెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్'. ఫిబ్రవరి రెండో వారం నుండి షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట. మరో ముఖ్యమైన పాత్రలో నిత్యా మీనన్ ను ఓకే చేసే ఆలోచనలో తెలుస్తోంది.

అయితే సమంతను తీసుకోవడంతో ఎన్టీఆర్ లో గుబులు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సమంత ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన బృందావనం మంచి విజయం సాధించింది. అయితే తర్వాత వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా', ‘రభస' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.

ఈ నేపథ్యంలో మళ్లీ సమంతతో అంటే కాస్త గుబులుగా ఉన్నాడట ఎన్టీఆర్. వాస్తవంగా చూస్తే ఇవన్నీ అర్థం పర్థం లేని సెంటిమెంట్లే. కథలో దమ్ము, దర్శకుడి వద్ద సత్తా ఉంటే సినిమా హిట్టవుతుంది అనే వాళ్లు లేక పోలేదు. అసలే సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. అందుకే సమంత విషయంలో యూనిట్ మరోసారి పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రకటించలేదని అంటున్నారు.

Samantha And Nithya Menen To Romance NTR In Koratala Siva's Janatha Garage

ఇతర విషయాల్లోకి వెళితే..జనతా గ్యారేజ్ అనేది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఈ మూవీ కోసం హైద్రాబాద్ సారధి స్టూడియోస్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఎన్టీఆర్ వర్క్ చేయబోయే జనతా గ్యారేజ్ పేరుగల మెకానిక్ షెడ్ ని దాని చుట్టుపక్కలుండే ప్రాంతాలను సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఇప్పటికే సెట్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపిస్తారని, ఇందులో మెకానిక్ గా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ డిఫరెంటుగా ఉంటుందని అంటున్నారు. జనతా గ్యారేజ్ లో కీలకపాత్రలో మెహన్ లాల్ నటించబోతున్న సంగతి తెలిసిందే. కేరళనుండి మరో యంగ్ హీరో నటించబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ సినిమాలో ఇతని పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం వుందని తెలుస్తోంది. అతను మరెవరో కాదు కేరళ స్టార్ హీరో అయిన ఫహాద్ ఫాజిల్.

English summary
Samantha have confirmed that she has signed on the dotted line for NTR's Janatha Garage, which will go on sets in the second week of February. It is almost confirmed that Nithya Menen will be playing the other lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu