Just In
- 8 min ago
రెచ్చిపోతోన్న బిగ్ బాస్ కంటెస్టెంట్: మొన్న ఏపీ సీఎంపై.. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేపై.. బలిసి మాట్లాడితే!
- 31 min ago
మా ఆయన దగ్గరున్నదే ఇష్టమన్న అనసూయ: యాంకర్ పర్సనల్ మేటర్ లీక్ చేసి షాకిచ్చిన రోజా
- 52 min ago
వేరే వ్యక్తిపై పడుకున్న సమంత: ఐలవ్యూ అంటూ క్యాప్షన్.. వాళ్ల దెబ్బకు పోస్ట్ డిలీట్ చేసేసిందిగా!
- 2 hrs ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
Don't Miss!
- Lifestyle
Republic Day 2021 : ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేకతలేంటో తెలుసా...
- News
పంతం నీదా... నాదా... క్షణ క్షణం ఉత్కంఠ భరితం... ఏపీలో పీక్స్‌కి ఎన్నికల పంచాయితీ...
- Finance
భారత్ V షేప్ రికవరీ, నాలుగింట ఒకవంతు తుడిచి పెట్టుకుపోయాయి: RBI
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆహాలో అత్యధిక పేమెంట్స్.. సమంత, తమన్నాలకు ఎంత ఇస్తున్నారో తెలుసా?
కరోనా దెబ్బకు ఓటీటీ సంస్థల జాతకమే మారిపోయింది. ఒక్కసారిగా డిజిటల్ మిడియాల వైపు జనాలు ఆసక్తి కనబరచడంతో బిజినెస్ వాల్యూతో పాటు ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా పెరిగింది. ఆడియెన్స్ ఎట్రాక్ట్ అవ్వాలి అంటే టీవీ షోలకు మించిన రేంజ్ లో ఫన్ ఉండాలి. అందుకే అగ్ర తారలను దింపుతున్నారు. ఆహా యాప్ హవా ఈ మధ్య గట్టిగానే పెరిగింది. 5మిలియన్స్ కి పైగా యూజర్లు పేరిగినట్లు తెలుస్తోంది. ఇక సమంత, తమన్నా ఆహా యాప్ పబ్లిసిటీ బాధ్యతను వారి భుజాలపై వేసుకున్నారు.

కొత్తగా ఆలోచిస్తున్న అల్లు అరవింద్
ఓటీటీ ప్రపంచంలో అనేక రకాల సంస్థలు ఎక్కువగా సినిమాలతోనే జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. వీలైనంత వరకు పెద్ద సినిమా హక్కులను కొనుగోలు చేసి బిజినెస్ వాల్యును పెంచుకుంటున్నారు. అయితే ఆహా యాప్ విషయంలో మాత్రం అల్లు ఆరవింద్ ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంది. కేవలం సినిమాలపైనే ఫోకస్ చేయకుండా రియాలిటీ షోలతో హైప్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అది కూడా అగ్ర తారలతో..

రెమ్యునరేషన్ కూడా గట్టిగానే..
అదే విధంగా రెగ్యులర్ వెబ్ సిరీస్ లు కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలని అనుకున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చేశారు. సమంత సామ్ జామ్ తో పాటు తమన్నా లేవంత్ హావర్ వెబ్ సిరీస్ లు జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక ప్రస్తుతం వీరి రెమ్యునరేషన్ విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరికి దాదాపు కోటికి పైగానే ఇస్తున్నారట.

సమంత కంటే తమన్నాకే ఎక్కువ
అయితే సమంత కంటే తమన్నాకే ఎక్కువ రెమ్యునరేషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. తమన్నా చేస్తున్న వెబ్ సిరీస్ కు దాదాపు రూ.1.8కోట్ల వరకు అందుతుమనట్లు సమాచారం. ఇక సమంత అన్ని ఎమోషన్స్ ని మిక్స్ చేసి సామ్ జామ్ అనే టాక్ షోను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆమెకు ఒక కోటి రూపాయల వరకు పారితోషికం అయితే అందుతుందట. ఇది ఒక పది రోజులు మాత్రమే అయ్యి ఉండవచ్చని కూడా టాక్ వస్తోంది.

రానున్న రోజుల్లో స్టార్ హీరోలు కూడా
హీరోయిన్స్ గానే కాకుండా సమంత, తమన్నా ఓటీటీ ప్రపంచంలో కూడా వారి ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో స్టార్ హీరోలు కూడా ఇలాంటి అడుగులు వేయడానికి రెడీగా ఉన్నారు. ఆహాలో సమంత టాక్ షో అయితే బాగానే క్లిక్కయ్యింది. మొదట విజయ్ దేవరకొండ రాగా ఆ తరువాత రానా, నాగ్ అశ్విన్ గెస్టులుగా వచ్చారు. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూతో రాబోతోంది సమంత.