»   » ఆ పాపాయి ఎవరు సమంత...?

ఆ పాపాయి ఎవరు సమంత...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోయిన్ సమంత ఈ మధ్య ట్విట్టర్లో తెగ యాక్టివ్‌గా ఉంటూ రోజూ ఏదో సంగతి చెబుతూ అభిమానులకు గిలింతలు పెడుతూనే ఉంది. ఇటీవల కాలంలో ఆమె తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్న విషయాలు కొన్ని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు కొత్త అనుమానాలకు తావిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ కిడ్‌తో షూటింగులో పాల్గొన్న సమంత....అమ్మలా ఫీలయ్యానంటూ ట్వీట్ చేసింది.

తాజాగా పవన్ కళ్యాణ్ చిత్రం 'అత్తారింటికి దారేది' షూటింగులో భాగంగా స్విట్జర్లాండ్‌లో ఉన్న సమంత ఓ పాపాయితో దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసింది. ఎంతో ముద్దొస్తోందంటూ ట్వీట్ చేసింది. ఆ పాపాయి ఎవరనే సంగతి పక్కన పెడితే....ప్రస్తుతం సమంత వాలకం చూస్తుంటే తల్లికావాలనే కోరిక ఆమెలో రోజురోజుకు పెరిగిపోతుందని చర్చించుకుంటున్నారు.

మరో వైపు హీరో సిద్ధార్థతో సమంత ప్రేమ వ్యవహారంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సిద్ధార్థ-సమంత పెళ్లి బాజా ఎప్పుడైనా మోగొచ్చని అంటున్నాయి సినీ వర్గాలు. ఇదే విషయమై వారిద్దరికి సంబంధించిన వార్తలు కొద్దినెలలుగా షికార్లు చేస్తున్నాయి. అడపాదడపా సిద్ధార్థ వాటిని ఖండిస్తున్నా సమంత మాత్రం నోరు మెదపటం లేదు. ఇటీవల సిద్ధార్థ తన తల్లిదండ్రులకు సమంతను పరిచయం కూడా చేసాడట.

కొన్ని రోజుల క్రితం సమంత మీడియాతో మాట్లాడుతూ..తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం ఒప్పేసుకుంది. 'అవును నేను ప్రేమలో ఉన్నాను' అని వ్యాఖ్యానించింది. అయితే తన ప్రియుడు ఎవరనే విషయం బయట పెట్టడానికి మాత్రం సమంత నిరాకరించింది. తన ప్రేమ వ్యవహారం పూర్తిగా ప్రైవేట్ మ్యాటరని, దాని గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది.

English summary
Samantha posted a Cutie pic in twitter. The pic creats sensation talk in industry. Samantha currently staying in switzerland for Pawan Kalyan movie shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu