»   » సంపత్ నంది ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం టైటిల్

సంపత్ నంది ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sampath Nandi
హైదరాబాద్: పవన్ కళ్యాణ్‌ 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్న సంపత్ నంది నిర్మాతగా మారుతున్న సంగతి తెలిసింది. సంపత్ నంది ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం టైటిల్ 'గాలి పటం' అని తెలుస్తోంది. అంతా కొత్తవారితో రూపొందే ఈ చిత్రం మరో రెండు నెలలులో ప్రారంభం కానుందని సమాచారం. ఏమైంది ఈ వేళ, రచ్చ చిత్రాలతో దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్న సంపత్ నంది అనంతరం పవర్ స్టార్ తో అవకాసం సంపాదించి,తన స్నేహితులను ఎంకరేజ్ చేయటానికి నిర్మాతగానూ మారటం జరుగుతోంది.

ఇక సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న 'గబ్బర్ సింగ్-2' సినిమా వివరాల్లోకి వెళితే...ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెలలోగానీ ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

English summary

 
 Director Sampath Nandi would be producing a light-hearted entertainer 'Gallipatam' in next two months with a new bunch of team, to join the league of director-turned-producers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu