»   » సంపత్ నంది...ఘోస్ట్ డైరక్షన్?

సంపత్ నంది...ఘోస్ట్ డైరక్షన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రచ్చ తో హిట్ కొట్టి వెంటనే పవన్ కళ్యాణ్ తో సినిమా పట్టిన సంపత్ నంది టాలీవుడ్ సర్కిల్స్ లో చాలా తెలివైన దర్శకుడుగా చెప్తూంటారు. ఆయన ఇప్పుడు ఘోస్ట్ డైరక్షన్ చేస్తున్నాడంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన నిర్మిస్తున్న 'గాలిపటం' చిత్రానికి సంపత్ నంది ఘోస్ట్ డైరక్టర్ గా చేసాడని వినపడుతోంది. ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న నవీన్ గాంధీ ని ప్రక్కన పెట్టి మేజర్ షూటింగ్ సంపత్ చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నిజా నిజాలు ప్రక్కన పెడితే నవీన్ గాంధీ...మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి ఆయన సన్నిహితులు...అతనితో పనిచేసినవారు అంటూంటారు. అలాంటప్పుడు వేరేవారు ఘోస్ట్ డైరక్షన్ చేయాల్సిన పనేముంది.

ఆది హీరోగా తెరకెక్కిన చిత్రం 'గాలిపటం'. ఎరికా ఫెర్నాండేజ్‌, క్రిస్టినా అకిహివా హీరోయిన్స్. నవీన్‌ గాంధీ దర్శకుడు. సంపత్‌నంది, కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి నిర్మాతలు. ఆగస్టు మొదటివారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Sampath Nandi turns 'Ghost' director

సంపత్‌నంది మాట్లాడుతూ ''యువతరం ప్రేమని ఎంత సీరియస్‌గా తీసుకొంటుందో చర్చించే చిత్రమిది. ముసుగులూ, గుద్దులాటలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగానే తెరపై నిరూపించే ప్రయత్నం చేశాం. ఆ విధానం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన గీతాలకు మంచి స్పందన వస్తోంది ''అన్నారు.

ఆది మాట్లాడుతూ... ప్రేమలో ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది. గాలిపటంలా మనిషీ, మనసూ గాల్లో తెలిపోతుంటారు. అదే.. ఆ ప్రేమ పెటాకులైతే అప్పుడు అసలు గొడవ మొదలవుతుంది. ఇద్దరి మధ్య ఈగోలు పెరిగిపోతే.. 'నువ్వెంత అంటే నువ్వెంత' అనుకొనే స్థాయికి పడిపోతుందా బంధం. ఓ జంట ప్రేమ కూడా ఇలానే వికటించింది. మరి ఆ తరవాత ఏమైంది? మళ్లీ కలుసుకొన్నారా? లేదంటే మరో తోడుని వెదుక్కొన్నారా? తెలుసుకోవాంటే మా సినిమా చూడండి అంటున్నారు ఆది.

English summary
Director Sampath Nandi produced a film called Gaalipatam . But people from Tollywood say that Sampath has ghost directed this film on some other's name.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu