»   » మెగా ఫ్యామిలీని టార్గెట్ : కొత్తజంటలో సంపూర్ణేష్?

మెగా ఫ్యామిలీని టార్గెట్ : కొత్తజంటలో సంపూర్ణేష్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sampoornesh Babu
హైదరాబాద్ : ఈ మధ్య సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎక్కడ చూసినా సంపూర్నేష్ బాబు అనే పేరు వినిపిస్తుంది. ఈయన ఎవరో కాదు 'హృదయ కాలేయం' అనే చిత్రం హీరో. 'ఎ కిడ్నీ విత్ హార్ట్' అనేది సబ్ టైటిల్. వెరైటీ టైటిల్‌తో మనోడు సినిమా ప్రియులనే కాదు, ఇటు మీడియాను ఆకర్షిస్తున్నాడు.

అయితే తన పబ్లిసిటీ పెంచుకోవడానికి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు సంపూర్ణేష్. ఆ మధ్య 'పవనిజం' కాన్సెప్టును ఇమిటేట్ చేస్తూ 'సంపూర్ణిజం' జిందాబాద్ అంటూ లోగోలు వదిలాడు. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ వార్త మెగా ఫ్యామిలీ హీరోతో సంబంధం ఉన్నది కావడం గమనార్హం.

ఈ రోజుల్లో, బస్టాప్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ హీరోగా 'కిత్త జంట' రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో స్పెషల్ క్యారెక్టర్ చేయించే ప్లాన్లో ఉన్నారట. మరి ఈ వార్త నిజమేనా? లేక పబ్లిసిటీ పెంచుకోవడానికి సంపూర్ణేష్ ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తెస్తున్నాడా? అనేది తేలాల్సి ఉంది.

గీతా అర్ట్స్ పతాకంపై బన్నీవాసు 'కొత్త జంట' చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అల్లు శిరీష్‌కు జోడీగా 'రొటీన్ లవ్‌స్టోరీ' ఫేమ్ రెజీనాను ఎంపిక చేశారు. శిరీష్‌ని ఈచిత్రంలో కొత్తగా చూపించబోతున్నారని, ఇంటిల్లీపాదీ అలరించేలా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.

English summary
Film Nagar gossip is that, Sampoornesh Babu play special role in Allu Sirish's new film ‘Kotha Janta’. Maruthi directs this movie and Bunny Vasu is producing the film on Geetha arts banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu