For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సంపూర్ణేష్ బాబు కు అంత సీనుందా?(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : రీసెంట్ గా సంపూర్ణేష్ బాబు...హార్లీ డేవిడ్ సన్ బైక్ పై ఎక్కి దాని ఫొటోని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో షేర్ చేసారు. సంపూ మీద ఉన్న క్రేజ్ తో దాన్ని నెట్ జనలు దాన్ని షేర్ చేసుకుంటా పోయారు. కొందరు ఉత్సాహవంతులు అయితే...సంపూర్ణేష్ బాబుని...హార్లీ డేవిడ్ సన్ బైక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసారు. అందుకే ఈ స్టిల్ అని కాప్షన్స్ కూడా రాసేసారు. వెబ్ మీడియా కూడా దాన్ని బేస్ చేసుకుని ..సంపూ...హార్లీ డేవిడ్ సన్ బైక్ అంబాసిడర్ అంటూ పబ్లిసిటీ మొదలెట్టింది. అయితే ఇది కొంతమంది హార్లీ డేవిడ్ సన్ బైక్ అభిమానులకు మంటెత్తిస్తోంది. వారు..అంత సీనుందా అంటూ వ్యంగ్య బాణాలు విసురుతున్నారు.

  ఇక సంపూ చిత్రాల విషయానికి వస్తే....

  హృదయ కాలేయం చిత్రంతో పరిచయమైన సంపూర్ణేష్‌బాబు హీరో గా మరో సినిమా కమిటయ్యారయిన సంగతి తెలిసిందే. సింగం 123 టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తమ 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. తమిళ హిట్ సింగం కి స్పూఫ్ లా ఉంటుందని వినికిడి. ఈ చిత్రం విషయమై మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు.

  Sampoornesh Babu with Harley Davidson

  మంచు విష్ణు మాట్లాడుతూ... ‘సింగం 123' నాకు చాలా ప్రతిష్ఠాత్మక చిత్రం. ఫేవరేట్‌ ప్రాజెక్ట్‌. నా మెయిన్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ దానిమీదే. అక్షిత్‌శర్మ అనే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థి దాన్ని డైరెక్ట్‌ చేయబోతున్నాడు. త్వరలోనే దాన్ని ప్రారంభించబోతున్నాం. జేమ్స్‌బాండ్‌, హాట్‌ షాట్స్‌, ట్రూ లైస్‌ సినిమాల తరహాలో యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌. వెరీ వెరీ గ్లామరస్‌ ఫిల్మ్‌ అన్నారు మంచు విష్ణు.

  ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు...కొబ్బరి మట్ట అనే చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే...సంపూర్ణేష్ బాబు హీరోగా... వైరస్ డాట్ కామ్ అనే పేరుతో ఓ వినూత్న చిత్రం తెరకెక్కుతోంది. (బి వేర్) అనేది ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రానికి సీ.హెచ్. శివరామకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ఎన్ ఫిల్మ్స్ పతాకంపై సలీం, ఎ.జె. రాంబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది.

  కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

  మరో ప్రక్క ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...సంపూర్ణేష్ బాబు ని హీరోగా పెట్టి ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం టైటిల్ "పోకిరి రిటర్న్స్'. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. దాంతో ఇది మహేష్ బాబు స్పూఫ్ గా చేస్తున్న చిత్రమా అని సందేహాలు మొదలయ్యాయి.

  English summary
  The team of Harley Davidson showroom in Hyderabad had a surprise visitor none other than Burning Star Sampoorneesh Babu fondly known as Sampoo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X