»   » సందీప్ కిషన్ నెక్ట్స్ చిత్రం దర్శకుడు ఖరారు

సందీప్ కిషన్ నెక్ట్స్ చిత్రం దర్శకుడు ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో వచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూన్న సందీప్ కిషన్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తనకు గుండెల్లో గోదారి చిత్రంతో గుర్తింపు తెచ్చి పెట్టిన దర్శకుడు కుమార్ నాగేంద్రతో తన తదుపరి చిత్రం ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ పూర్తి అయ్యి...మిగతా నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. సందీప్ కిషన్ కి ఇప్పుడు బ్రేక్ రావటంతో వరస ఆఫర్స్ వస్తున్నాయి. నిర్మాతలు సైతం అతనిపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ... 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో నాకు మంచి హిట్టొచ్చినా వెంటనే ఏ సినిమాకీ నేను సంతకం చేయలేదు. నేను ఊహించనంత రెమ్యూనరేషన్ ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నాకు డబ్బు కంటే సినిమా ముఖ్యం. సందీప్ సినిమా అంటే ఇవాళ ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా వస్తున్నారు. వాళ్లని సంతృప్తిపరచడం నా బాధ్యత. వాళ్లని దూరం చేసుకోని సినిమాలే చేస్తాను. అలాగే కొంత కాలం పాటు మరింత గుర్తింపు కోసం సోలో హీరో సినిమాలే చేద్దామని నిర్ణయించుకున్నా అన్నారు.

Sandeep coming with GG director

నెక్ట్స్ ప్రాజెక్టులు వివరిస్తూ... 'డీకే బోస్' విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 'రారా కృష్ణయ్య' చేస్తున్నా. 'రొటీన్ లవ్‌స్టోరీ' తర్వాత మరోసారి రెజీనాతో కలిసి చేస్తున్నా. వంశీకృష్ణ నిర్మిస్తున్న ఆ చిత్రానికి కృష్ణవంశీ శిష్యుడు మహేశ్ డైరెక్టర్. మరో రెండు కమిట్‌మెంట్స్ ఉన్నాయి అని చెప్పారు. ఏ సినిమానైనా అంత త్వరగా నేను ఒప్పుకోను. సౌకర్యంగా అనిపిస్తేనే చేస్తాను. మనం ఏం తీసినా జనం చూస్తారనుకోవడం తప్పు. మంచి కథతో సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు చూడండి. అవన్నీ మంచి సినిమాలు అన్నారు.

అలాగే నేను రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున అభిమానిని. వాళ్ల సినిమాలు తెగ చూసేవాణ్ణి. నా మీద వాళ్ల ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. అవకాశం వస్తే నాగార్జున 'గోవిందా గోవింద' సినిమాని రీమేక్ చేయాలని ఉంది. నా దృష్టిలో అది సూపర్ సినిమా. దేవుడి కోసం మనిషి పోరాడ్డంలో ఎంత కిక్ ఉంటుందో ఆ సినిమాలో బాగా చెప్పారు. ఇప్పటి హీరోల్లో మహేశ్, పవన్‌కల్యాణ్, రవితేజ నాకు బాగా ఇష్టమైన హీరోలు. ఎంచుకునే సినిమాల విషయంలో బన్నీ అంటే ఇష్టం. నేను హీరో కావడానికి బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ చేసిన 'ఆర్య' అని చెప్పుకొచ్చారు.

English summary
Sandeep Kishen who is on cloud nine with the success of his recent film ‘Venkatadri Express’ is all set to team up with ‘Gundello Godavari’ fame director Kumar Nagendra. Currently film makers are busy with finalising the cast. Further details about this project will be out soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu