»   »  పవన్ ఫైర్ అయ్యాడా...నిజమా?

పవన్ ఫైర్ అయ్యాడా...నిజమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుకున్నది అనుకున్నట్లు కాకపోతే ఎవరికైనా కోపమొస్తుంది. అందుకు పవన్ కళ్యాణ్ ఏమీ మినహాయింపు కాదు అంటున్నారు సినీ జనం. ఆయన రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు,నిర్మాతపై ఫైర్ అయినట్లు మీడియాలో వార్తలు గుప్పు మన్నాయి. అందుకు కారణం ప్లానింగ్ సరిగ్గా లేకుండా 'సర్దార్' యూనిట్ షూటింగ్ లోకి దిగడమే అంటున్నారు.

నిజానికి 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా వచ్చే జనవరిలో రిలీజ్ చేయాలన్నది పవన్ ప్లాన్. అయితే దర్శకుడు, కెమెరామేన్ ల అంతర్గత విభేదాలతో కెమెరామెన్ తప్పుకోవడంతో షూటింగ్ కొద్ది రోజులు నిలిచిపోయింది. అంతకు ముందు సంపత్ నందితో అనుకుని చాలా కాలం లేటయ్యింది. తర్వాత హీరోయిన్ మార్పు జరిగింది. ఇలా కంటిన్యూగా ఏదో ఒక మార్పు జరుగుతూ షూటింగ్ లేటవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఆయన షూటింగ్ ని స్పీడప్ చేయాలనుకున్నారు. అయితే అందుకు తగినట్లుగా దర్శకుడు స్పందించి యాక్షన్ లోకి రావటంలేదు అని చెప్పుకుంటున్నారు.

రీసెంట్ గా మహారాష్ర్ట, గుజరాత్ వంటి ప్రాంతాల్లో కీలకమైన సీన్స్‌ని షూట్ చేశారు. గుజరాత్‌లో నెలరోజులపాటు షూటింగ్ చేసినప్పటికీ, ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ పూర్తి కాకలేదని సమాచారం. దాంతో ఈ విషయం తెలుసుకున్న పవన్.. దర్శకుడు, నిర్మాతకు సీరియస్ గా నే చెప్పినట్లు చెప్పుకుంటున్నారు.

Sardaar Gabbar Singh : Pawan fire on Untit

పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్ సింగ్'. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రియల్ మొదటి వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సమ్మర్ ట్రీట్ గా ఈ చిత్రం అలరించనుందని,అప్పుడైతే వేసవి శెలవలు కలిసి వస్తాయని టీమ్ భావిస్తోంది. ఈ విషయమై అధికారికంగా నిర్మాతల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం సర్దార్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ లొకేషన్ లోని కొన్ని స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి దేవీశ్రీ స్వరాలు సమకూరుస్తున్నాడు.

నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, కెమెరా: జయనన్‌ విన్సెంట్‌.

English summary
Pawan Kalyan fired on Sardaar Gabbar Singh prodcuer and director due to lack of proper planning and delay in film shooting. Sardaar Gabbar Singh will be releasing in the first week of April as an early summer treat for fans.
Please Wait while comments are loading...