»   »  మెగా పంక్షన్ కోసం..పవన్ ఆదేశం

మెగా పంక్షన్ కోసం..పవన్ ఆదేశం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలను మార్చి 12న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ ఆడియో ఫంక్షన్ నిమిత్తం కోటి పాతిక లక్షలు దాకా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. చిత్రాన్ని బారీ రేట్లుకు అమ్ముతున్న నేపధ్యంలో ఈ రేంజి ఖర్చు పెట్టి చేస్తే బాగుంటుందని పవన్ చేసిన సూచన మేరకు ఇలా ముందుకు వెల్తున్న్టట్లు చెప్తున్నారు.


టార్ రేటెడ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజన్సీలకు ఈ ఆడియో లాంచ్ ని అప్పచెప్పినట్లు చెప్తున్నారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ..ఈ ముగ్గరూ ఈ ఆడియో లాంచ్ లో మెరవనున్నారు. మెగా ఆడియో పంక్షన్ గా ఈ పంక్షన్ నిలిచిపోవాలని పవన్ ఆదేశించినట్లు సమాచారం.


2012లో విడుదలైన ‘గబ్బర్‌సింగ్‌' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ సరసన కాజల్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాయ్‌ లక్ష్మి ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఏప్రిల్‌లో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు


సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ కామన్. అయితే పవన్ కళ్యాణ్ వంటివారు సెంటిమెంట్స్ ఫాలో అవుతారా అంటే...కొన్ని వార్తలు వింటూంటే నిజమే...ఫాలో అవుతన్నారు అనిపిస్తుంది. బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్ సినిమాలు సమ్మర్ కు రిలీజే అయ్యి సుపర్ హిట్ సినిమాలుగా మారడంతో ఇప్పుడు పవన్ వాటి దారిలోనే నడవాలనుకుంటున్నాడు.


'Sardaar Gabbar Singh's Audio Launch Budget

అందుకే ఇప్పుడు సర్థార్ ను ఈ సమ్మర్ తీసుకురావలని ప్రయత్నిస్తున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ బయిట పడినటైంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్దార్‌ గబ్బర్ సింగ్' 11మే 2016 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.


వేసవిలో అయితే శెలవలు కలిసి వస్తాయని టీమ్ భావిస్తోంది. ఈ విషయమై అధికారికంగా నిర్మాతల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మరో ప్రక్క ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమయ్యింది.


ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్, రాయ్ లక్ష్మీ ఆడిపాడుతున్నారు. అలాగే కన్నడ భామ సంజన కూడా ఈ మధ్యనే ఈ లిస్ట్ లో చేరింది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.


కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి దేవీశ్రీ స్వరాలు సమకూరుస్తున్నాడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, కెమెరా: జయనన్‌ విన్సెంట్‌.

English summary
It was buzzed that Rs.1.25 crores budget will be incurred by 'Sardaar Gabbar Singh' makers for audio launch .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu