»   » పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ పెద్ద ప్లానే వేసిందా?

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ పెద్ద ప్లానే వేసిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల పని గట్టుకుని మరీ పవన్ కళ్యాన్‌పై ప్రశంసల వర్షం కురించిన సంగతి తెలిసిందే. పవన్‌తో పొసగక విడిపోయిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌ను పొగుడుతూ వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆమె ఇలా మాట్లాడటం వెనక పెద్ద ప్లానే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగంలో బిజీగా ఉన్న రేణు దేశాయ్ భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉందని, ఆమె బిజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతోందని, త్వరలోనే ఆమె మోడీని కలిసే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి, మోడీకి మద్దతు పలకవడంతో తన మాజీ భర్తపై పనిగట్టుకుని ప్రశంసలు గుప్పించిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Secret behind Renu Desai Support Pawan?

ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ మాట్లాడుతూ....పవన్ కళ్యాణ్ చాలా ఉదారమైన, ఉదాత్తమైన, వినయపూర్వకమైన, నిష్కళంకమైన వ్యక్తి అని, ఆయన హృదయం నిష్కళంకమైనదని చెప్పారు. తామిద్దరు జీవితంలో ఏం జరిగిందో తమకు మాత్రమే తెలుసునని చెప్పారు. తమ ఇద్దరి జీవితంలో ఏం జరిగిందో ఇతరులెవరికీ తెలియదన్నారు. తామిద్దరి జీవితంపై కామెంట్ చేసే అర్హత ఈ ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు.

సొసైటీకి ఏదో చేయాలని మనస్ఫూర్తిగా, నిజాయితీగా తపించే పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా గౌరవమని, ఆయనను తాను ఆరాధిస్తానని రేణు దేశాయ్ అన్నారు. తాను అప్పుడు.. ఇప్పుడు... ఎప్పుడు.. పవన్‌కు మద్దతుగా ఉంటానని చెప్పారు. తాను పవన్‌కు ఎప్పుడు అండగా నిలబడ్డానని, ఇక ముందు మద్దతుగా ఉంటానన్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ప్రపంచానికి అవసరమన్నారు.

English summary
Secret behind Renu Desai Support Pawan Kalyan. Is she supporting her ex-husband just because he has the ability to go and meet Modi in person and can become something in future as a politician or is it that she just spoke her mind?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu