సలార్ సినిమాలో స్టార్ హీరో భార్య.. ప్రభాస్ తో మొదటిసారి అలా..
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అత్యదిక పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. పరిస్థితులు అనుకూలించి ఉంటే ఇప్పటికే ఒక సినిమాను విడుదల చేసి మరో రెండు సినిమాలను విడుదలకు రెడీగా ఉంచేవారు. కానీ జోవిడ్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది.
గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బడ్జెట్ సినిమాలను ఒకేసారి భుజాలపై మోస్తున్న ప్రభాస్ ముందుగా రాధేశ్యామ్ సినిమాను రిలీజ్ చేసి ఆ తరువాత సలార్ తో రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన రూమర్స్ రోజుకోటి వైరల్ అవుతోంది. అయితే సినిమాలో ప్రభాస్ అక్క పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.

ఇదివరకే రమ్యకృష్ణ అని టాక్ రాగా అది నిజం కాదని మరొక న్యూస్ వైరల్ అవుతోంది. స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతికను సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇదివరకే ఆమెతో మాట్లాడినట్లు సమాచారం.
ఇక జ్యోతిక గతంలో మాదిరిగా ఇండస్ట్రీలో బిజీగా నటించడం లేదు. ఎక్కువగా ఆమె ఫ్యామిలీ కోసమే సమయన్ని కేటాయిస్తోంది. పిల్లలు పెద్ద వాళ్ళు కావడంతో కేవలం అప్పుడప్పుడు మాత్రమే విభిన్నమైన పాత్రల్లో నటించడానికి ఒప్పుకుంటోంది. మరి బాహుబలి ప్రభాస్ కు సోదరిగా నటించడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











