»   » ఫ్యాన్ కోసం ఆహీరోయిన్‌పై కన్నేసిన స్టార్ హీరో?

ఫ్యాన్ కోసం ఆహీరోయిన్‌పై కన్నేసిన స్టార్ హీరో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ త్వరలో 'ఫ్యాన్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించని ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో షారుక్ ఖాన్‌కు సరిజోడీగా నిలిచే హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది.

ప్రస్తుతం ఈ చిత్రం కోసం ముగ్గురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ 'ఆహా కళ్యాణం' చిత్రంలో నానికి జోడీగా నటించిన వాణి కపూర్ అని టాక్. సినిమా స్టోరీ పరంగా, హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ పరంగా ఆమె పర్ ఫెక్టుగా సూటవుతుందని నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నాడు.

Shahrukh Khan Considering Aaha Kalyanam Actress For Fan?

ఫ్యాన్ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం యశ్ రాజ్ ఫిలింస్‌ వాణి కపూర్‌‌తో మూడు చిత్రాలకు డీల్ కుదుర్చుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఈ బ్యానర్లో శుద్ధ్ దేశీ రొమాన్స్, ఆహా కళ్యాణం చిత్రాల్లో నటించింది.

తాజాగా 'ఫ్యాన్' చిత్రం కోసం ఆదిత్య చోప్రా ఆమెను ప్రిఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరో షారుక్, దర్శకుడు మనీష్ శర్మ కూడా ఆమెను తీసుకునేందుకు సుముఖత చూపితే ఆమెనే ఖరారయ్యే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో లెక్కేలేదు. అలాంటి షారుక్ ఈ చిత్రంలో ఓ సూపర్ స్టార్ ఫ్యాన్‌గా నటిస్తుండటం ఆసక్తికరం. ఈ చిత్రానికి వాణి కపూర్‌‌తో పాటు పరిణీతి చోప్రా, అనుష్క శర్మల పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి హబీబ్ పైసల్ కథ అందించారు. ఈ సంవత్సరం మే నెలలో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

English summary
Bollywood Baadshah Shahrukh Khan is currently busy with pre-production works of his next film titled Fan. The Superstar, who is on a look out for suitable heroine for the movie, is reportedly considering the names of three actress and one among them is none other actress Vaani Kapoor, who recently forayed into South Indian film industry with Yash Raj Films' Aaha Kalyanam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu