»   » కారణం అదేనా......? తన ఫ్యామిలీపై షకీలా రివేంజ్?

కారణం అదేనా......? తన ఫ్యామిలీపై షకీలా రివేంజ్?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఒకప్పటి దక్షిణాది శృంగార తార షకీల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఒకప్పుడు తన శృంగార సినిమాలతో దక్షిణాదిన తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపిన షకీలా ప్రస్తుతం ఆ సినిమాలు మానేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. దీంతో పాటు ఓ సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతోంది.

  తాజాగా షకీలా కన్నడలో టీవీ చానల్‌లో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన బోతోంది. ఈ షోలో ఆమె తన జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలు చెప్పబోతోందని సమాచారం. తన జీవితం ఇలా తయారు కావడానికి తన కుటుంబ సభ్యులే అని గతంలో పలు సార్లు చెప్పిన షకీలా....ఈ షోలో మరిన్ని సంచలన విషయాలు బయట పెట్టబోతోందని అంటున్నారు.

  తన జీవితం చీకటి కూపంలోకి పోవడానికి కారణమైన తన ఫ్యామిలీపై షకీలా ఈ విధంగా తన కసి తీర్చుకుంటుందని అంటున్నారు. చిన్నప్పుడు సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగిన ఆమె మలయాళం సినీ పరిశ్రమకు వెళ్లడం వెనుక ఆశ్చర్యపరిచి బాధపెట్టే వాస్తవాలు ఉన్నాయి. షకీల గతంలో తన ఆత్మకథలో ఫ్యామిలీ గురించిన చెప్పిన

  వివరాలు స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

  షకీలా

  షకీలా


  మా అమ్మకు సంబంధించి నాకు ఎటువంటి మంచి మెమరీస్ లేవు. ఆమె నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. ఆప్యాయంగా పలకరించలేదు. నా జీవితాన్ని నాశనం చేసింది మా అమ్మే. బహుశా మా అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే ప్రేమ లేదు. అస్తమాను తిడుతూ ఉండేది. శాపనార్థాలు పెట్టేదని షకీల గతంలో చెప్పుకొచ్చింది.

  అమ్మే అలా చేసింది

  అమ్మే అలా చేసింది


  ఇలా నాకు పదహారేళ్లు వచ్చాయి. ఎప్పుడూ నన్ను తిట్టే అమ్మ ఒక రోజు నన్ను పొగిడింది. ఆ తర్వాత- నన్ను ఒక వ్యక్తి వచ్చి బయటకు తీసుకువెడతాడని చెప్పింది. అతను నన్ను ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్తాడనీ.. అతనితో 'మంచి'గా ఉంటే- మొత్తం కుటుంబ ఆర్థిక సమస్యలు తీరిపోతాయనీ చెప్పింది. అతను చెప్పినట్లు చేయాలని మరీమరీ చెప్పింది.

  చీకటి కూపంలోకి..

  చీకటి కూపంలోకి..


  మా అమ్మ మాటల వెనకున్న అర్థమేమిటో నాకు బోధపడింది. కానీ నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అమ్మ చెప్పినట్లే ఒక వ్యక్తి వచ్చి హోటల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ రూమ్‌లో ధనవంతుడని మా అమ్మ చెప్పిన వ్యక్తి ఉన్నాడు. అతనిని చూసి నేను బాధతో, భయంతో గడ్డకట్టుకుపోయా. ఆయన నన్ను రేప్ చేశాడు. ఇది ప్రారంభం మాత్రమే...

  షకీలా జీవితం

  షకీలా జీవితం


  ఆ తర్వాత అలాంటి ధనవంతులనేకమంది దగ్గరకు నేను వెళ్లాల్సి వచ్చింది. నాకు బాధ కలిగేది. అప్పుడప్పుడు కొంత తృప్తి కూడా కలిగేది. నేను నా కన్యాత్వాన్ని ఎప్పుడు కోల్పోయానో నాకే తెలియదు.

  అక్క వల్లే దివాలా...

  అక్క వల్లే దివాలా...


  మా పెద్దక్క నూర్జహాన్ నేను దివాళా తీయటానికి ప్రధాన కారణం. ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణిని నేనే. అయినా నా సంపాదనంతా మా అక్క దొంగిలించింది అని షకీల తన ఆత్మకథలో చెప్పుకొచ్చారు.

  English summary
  
 Actress Shakila, who is well known to Telugu, Tamil, Kannada and Malayalam audience shocked everyone with her statements in Big Boss reality how in Kannada. As per the reports Shakeela will tell in this Big Boss episode that she will chose to be born as Shakeela itself and into the same family to take revenge on her own family members.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more