»   » పవన్ ,డాలీ ప్రాజెక్టుపై షాకింగ్ న్యూస్, ఇలా జరుగతోందేంటి? అంతటా ఇదే

పవన్ ,డాలీ ప్రాజెక్టుపై షాకింగ్ న్యూస్, ఇలా జరుగతోందేంటి? అంతటా ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభమై ఆ తర్వాత రకరకాల కారణాలతో దర్శకుడు మార్పు జరిగిన సంగతి తెలిసిందే. పవన్ ని గతంలో గోపాల గోపాల చిత్రం లో డైరక్ట్ చేసిన డాలీ సీన్ లోకి వచ్చారు. ఆయన ఈ ప్రాజెక్టుని టేకోవర్ చేసుకుని మార్పులు, చేర్పులు స్క్రిప్టులో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు విషయమై ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు మీడియాలో సర్కులేట్ అవుతోంది. అందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

అందుతున్న సమాచారం ప్రకారం...ఈ చిత్రం స్క్రిప్టులో డాలీ చేస్తున్న మార్పులు పవన్ కళ్యాణ్ కు నచ్చటం లేదని వార్త. ఆయన జూలై 2 వ తేది నుంచి పొల్లాచిలో ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనాలి అని ప్లాన్ చేసారు. అయితే ఈ మార్పులు, చేర్పులుతో కథ విషయమై అసంతృప్తిగా ఉన్న పవన్, ఈ ప్రాజెక్టుని ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు. కేవలం రూమర్ లేక నిజంగానే ఈ ప్రాజెక్టు ఆగుతోందా తెలియరావాల్సి ఉంది.

ఇక ఈ ప్రాజెక్టుని ఆపి, పవన్ ..త్రివిక్రమ్ స్క్రిప్టు ని పట్టాలెక్కించాలని నిర్ణయించుకన్నట్లు చెప్తున్నారు. పవన్ ప్రస్తుతం తన పొలిటికల్ మీటింగ్ లతో బిజీగా ఉన్నారని, లండన్ ప్రయాణం కూడా ఉంది కాబట్టి , ఇవన్నీ పూర్తై పవన్ వచ్చే లోపే త్రివిక్రమ్ స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసి నేరేషన్ ఇస్తారని భావిస్తున్న్రారు. ఇదే నిజమే అయితే త్రివిక్రమ్ తో అనుకున్న ఈ ప్రాజెక్టు నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది.

తమిళ చిత్రం వీరుడొక్కడే ఆధారంగా ఇది రూపొందుతోందని, అక్కడ అజిత్ ఎలా కనపడ్డారో అచ్చం అలాగే ఈ సినిమా లో చేస్తున్నారని చెప్తున్నారు. ఆ సినిమా రైట్స్ నిర్మాత తీసుకోలేదని, దీనిపై వీరమ్ నిర్మాతలు కోర్టుకు వెళ్లే అవకాసం ఉందని ఆ మధ్యన ఓ ఇంగ్లీష్ దిన పత్రిక ప్రముఖంగా రాసుకొచ్చింది.

స్లైడ్ షోలో మిగతా డిటేల్స్...

ఇంకా లేటు

ఇంకా లేటు

దర్శకుడుగా సీన్ లోకి డాలీ రావటంతో ఆయన స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. దాంతో లేటవుతోందని అంటున్నారు

వీరమ్ అనఫీషియల్

వీరమ్ అనఫీషియల్

ఈ సినిమా వీరమ్ (తెలుగులో వీరుడొక్కడే) కు ఫ్రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు.

వీరమ్ నిర్మాతలు కేసు

వీరమ్ నిర్మాతలు కేసు

ఆ మధ్యన ఈ ప్రాజెక్టు పై వీరమ్ నిర్మాతలు కధా చౌర్యం కేసు పెట్టాలనకున్నట్లు తమిళ మీడియాలో వార్తాలు వచ్చాయి.

కథేంటో తెలియకుండా

కథేంటో తెలియకుండా

కేవలం మీడియాలో వచ్చే రూమర్స్ ని బేస్ చేసుకుని, కథేంటో తెలియకుండా కేసు పెట్టడం కుదరదని ఆగారని తమిళ మీడియా అంటోంది.

రెండు నెలలు పైగా

రెండు నెలలు పైగా

శరత్ మరార్ నిర్మించనున్న తాజా చిత్రం లాంచనంగా ప్రారంభమై దాదాపు రెండు నెలలు పైగా అవుతోంది. ఇంకా ఈ చిత్రం షూటింగ్ మొదలు కాకపోవడంతో కథా చర్చల దశలో ఉందనీ, రేపో మాపో చిత్రీకరణ మొదలుపెట్టేస్తారనే చర్చ జరుగుతోంది.

సూర్య హ్యాండ్

సూర్య హ్యాండ్

అయితే అసలు విషయం అది కాదని నిర్ధారణ అయ్యింది. చిత్రదర్శకుడు ఎస్.జె. సూర్య డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతోనే షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ విషయాన్ని ఆదివారం చిత్రనిర్మాత శరత్ మరార్ ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

మహేష్ కు విలన్ గా

మహేష్ కు విలన్ గా

ఈ సినిమాకు డైరక్టర్ గా సినిమా ప్రారంభించి, మహేష్ కు విలన్ గా కమిటై ఎక్కువ డేట్స్ ఇఛ్చారని, దాంతో తమ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేరని పవన్ భావించారట.

నెగిటివ్ గా ప్రచారం

నెగిటివ్ గా ప్రచారం

ఇదే అవకాసం గా సర్దార్ గబ్బర్ సింగ్ కు ఇలాగే సంపత్ నందికి అవకాసమిచ్చినట్లే ఇచ్చి తర్వాత బాబిని సీన్ లోకి తెచ్చాడని, ఇప్పుడు సూర్యకు ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చి, డాలీని సీన్ లోకి తెచ్చారని,చిలవలు పలవలు చేస్తూ నెగిటివ్ గా మీడియాలోకథనాలు మొదలయ్యాయి.

అయితే

అయితే

తమిళంలో ఎస్.జె. సూర్య నటించిన 'ఇరైవి' ఇటీవల విడుదలైంది. ఆ చిత్రం తర్వాత సూర్యకు తమిళ, తెలుగు భాషల్లో నటుడిగా పలు అవకాశాలు రావడంతో పవన్ కల్యాణ్‌తో కమిట్ అయిన చిత్రానికి టైమ్ కేటాయించలేని పరిస్థితి అని నిర్మాత చెప్తున్నారు.

సూర్యతో మాట్లాడే ఈ నిర్ణయం

సూర్యతో మాట్లాడే ఈ నిర్ణయం

ఈ కారణంగా సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో పవన్ కల్యాణ్‌తో చర్చించి, సూర్య స్థానంలో వేరే దర్శకుణ్ణి తీసుకోవాలని శరత్ మరార్ నిర్ణయించుకున్నారు. సూర్యతో కూడా మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారట.

ఎప్పటినుంచి

ఎప్పటినుంచివెంకటేశ్-పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో 'గోపాల గోపాల' తెరకెక్కించిన డాలీ (కిశోర్‌కుమార్ పార్థసాని) ని దర్శకుడిగా ఫిక్స్ చేశారు. జూలై నెలాఖరున షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

ఫ్యాక్షన్ లీడర్ గా..

ఫ్యాక్షన్ లీడర్ గా..

ఇందులో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నాడని , ఫ్యాక్షన్ నేపధ్యంలో జరిగే ప్రేమ కథ ఇదని తెలుస్తోంది.

టైటిల్

టైటిల్


ఈ నేపథ్యంలో 'కడప కింగ్' టైటిల్ అయితే బాగుంటుదని భావించిన దర్శక నిర్మాతలు.. ఫిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు టాక్. అయితే ఈ టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేస్తున్నారా లేదని చేప్పలేమంటున్నారు సినీజనాలు

వెంటనే త్రివిక్రమ్ తో

వెంటనే త్రివిక్రమ్ తో

దాసరి నిర్మాతగా పవన్‌ నటించనున్న సినిమాకి త్రివిక్రమ్ పేరే వినిపిస్తోంది. మరోవైపు త్రివిక్రమ్‌ మరో స్నేహితుడు ‘హారిక & హాసిని క్రియేషన్స్' అధినేత ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా ‘పవన్-త్రివిక్రమ్'లతో ఓ సినిమా తెరకెక్కనుందన్న వార్త జోరందుకుంది.

దిల్ రాజుతో

దిల్ రాజుతో

దిల్ రాజు ఎప్పటి నుంచో పవన్ తో చేయాలని ఆశపడుతున్నారు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో అయినా అది సెట్ అవుతుందనుకుంటే అది మరింత దూరం జరిగుతున్నట్లు అనిపిస్తోంది.

English summary
Sources revealed that Pawan Kalyan is not happy with Dolly who suggested changes for the script of the film. There are talks that the film might be shelved.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu