»   » శేఖర్ కమ్ములతో ఓకే... పూరికి మొండిచెయ్యి?

శేఖర్ కమ్ములతో ఓకే... పూరికి మొండిచెయ్యి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పటినుంచో వార్తల్లో నానుతున్న శేఖర్ కమ్ముల, మహేష్ బాబు ప్రాజెక్టు నిజమయ్యే క్షణాలు వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ రీసెంట్ గా శేఖర్ కమ్ములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

వరసపెట్టి ప్రాజెక్టులు ఓకే చేస్తున్న మహేష్ బాబు.. ఈ సినిమాను ఓకే చేసినట్లు చెప్తున్నారు. మురుగదాస్ చిత్రం తర్వాత ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. మరి ఈ మధ్యలో చేస్తామని చెప్పిన పూరి ప్రాజెక్టు ఏమైనట్లు అనేది ఇప్పుడు క్వచ్చిన్ మార్క్ గా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం గతంలో మహేష్ తో టక్కరి దొంగ చిత్రం డైరక్ట్ చేసిన జయంత్ సి పరాంన్జీ ఈ చిత్రానికి నిర్మాతగా ఉండనున్నారు. 2016 ద్వితీయార్దంలో ఈ చిత్రం పట్టాలు ఎక్కనుంది.

Shekar Kammula next with Mahesh babu?

సున్నితమైన భావోద్వేగాలను తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్ కమ్ముల...మహేష్ బాబుని ఎలా డీల్ చేస్తారు అనేది ఆసక్తికమైన పరిణామం. మహేష్ అభిమానులకు నచ్చేలా ఈ చిత్రం ఉండాలని శేఖర్ కమ్ముల స్క్రిప్టు పై కసరత్తు చేస్తున్నట్లు చెప్తున్నారు.

స్క్రిప్టు విషయంలో సైతం జయంత్ దగ్గరుండి తన కమర్షియల్ చిత్రాల అనుభవంతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. శేఖర్ కమ్ముల చిత్రం తర్వాత ఫ్రెష్ గా 2017లో పూరి తో మహేష్ సినిమా ఉంటుందా...అలా అయితే త్రివిక్రమ్ తో ఎప్పుడు చేస్తారు అనేది కూడా ఓ మిలియన్ డాలర్ ప్రశ్నే.

English summary
According to the latest grapevine, Mahesh has given his nod to Sekhar Kammula's line.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu