»   » నాగార్జునపై మండిపడుతున్న నిర్మాత కొడుకు

నాగార్జునపై మండిపడుతున్న నిర్మాత కొడుకు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  నాగార్జున తీసుకొచ్చి పరిచయం చేసిన అజయ్ భుయాన్ తోనే సినిమా చేసాం..దడ దడలాడిస్తుడనుకుంటే దడ పుట్టించాడు అని నిర్మాత డి శివ ప్రసాద్ రెడ్డి కుమారుడు చందన్ రెడ్డి తన ప్రెండ్స్ వద్ద బాధపడుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కథ విన్నాను చాలా బాగుంది.. చాలా స్టైలిష్ టేకింగ్ అంటూ దర్శకుడు గురించి నాగార్జున చెప్పి ఈ ప్రాజెక్టు ఓకే చేయించాడు.. చూస్తే సినిమా ఇలా వచ్చింది అని వాళ్ళు ఫీలవుతున్నారుట. ఇక నాగచైతన్య డేట్స్ ని తీసుకొచ్చి ఇవ్వటమే నాగార్జున గొప్పగా అభివర్ణించాడని అదే కొంపముంచిందని,అప్పుడు కేడీ సమయంలోనూ ఇలాగే కొత్త డైరక్టర్,స్టైలిష్ టేకింగ్, మంచి నాలెడ్జ్ అంటూ నాగార్జునే తీసుకొచ్చాడు.. అప్పుడు ఇదే రిజల్ట్ వచ్చిందని అని బాధపడుతున్నారని చెప్పుకుంటున్నారు.

  అందులోనూ దర్శకుడు నాగార్జున అండ చూసుకుని డబ్బుని నీళ్ళులా ఖర్చుపెట్టాడని అదే సినిమా కమర్షియల్ గానూ నిర్మాతను నష్టాల్లో తోసేయటానికి కారణమైందంటున్నారు. నిజానికి సినిమా హిట్టైనా రికవరీ అవ్వటానికి చాలా కాలం పట్టేదని తేల్చి చెప్తున్నారు. నాగార్జున కొద్దిగా స్క్రిప్టుపై అవగాహనతో చూసుకుని ఉంటే తన కుమారుడుకి కూడా ఇలా ఇమేజ్ డ్యామేజ్ చేసే చిత్రం వచ్చేది కాదని,కథను నమ్మకుండా కేవలం దర్శకుడు టేకింగ్, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం, ఎన్నారై కావటం, హాలీవుడ్ నాలెడ్జ్ పరిగణలోకి తీసుకుని దడని ఫైనలైజ్ చేసారని అదే తమ కామాక్షి బ్యానర్ లో వరసగా చేస్తున్న సినిమాలకు దెబ్బకొడుతోందని చెప్పుకుని బాధపడుతున్నారని వినపడుతోంది.

  English summary
  Shiva Prasad Reddy's son Chandan Reddy is expressing anguish on Nagarjuna in front of his friends as why the top hero is unable to justify the strength in scripts like dhada even with a vast experience under his belt.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more