Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్: శంకర్ ‘ఐ’ స్టోరీలైన్ లీక్ చేసింది అతడేనా?
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఐ' చిత్రం సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే విడుదలకు ముందే స్టోరీలైన్ లీక్ అవ్వడం హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో విక్రమ్ బాడీ బిల్డర్ లింగేశం పాత్రలో, యాడ్ ఫిల్మ్ మోడల్ లీ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.

అయితే సినిమా స్టోరీలైన్, కాన్సెప్టు బయటకు రావడానికి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న పిసి శ్రీరామ్ అనే వదంతులు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పొరపాటును ఆయన బయట పెట్టాడని అంటున్నారు. అయినా దీని వల్ల పెద్దగా సమస్య ఏమీ ఉండనది అంటున్నారు యూనిట్ సభ్యులు.
కాగా...ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదలైన కేవలం 8 రోజుల్లోనే యూట్యూబులో 5 మిలియన్ హిట్స్ సొంతం చేసుకుంది. అత్యధిక హిట్స్ సొంతం చేసుకున్న ట్రైలర్ గా ఈ ట్రైలర్ రికార్డు సృష్టించింది. అత్యధిక మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాగా కూడా ఈ చిత్రం టాప్ పొజిషన్లో ఉంది.
దర్శకుడిగా ఇంత వరకూ ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇపుడు చియాన్ విక్రమ్ హీరోగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ధీటుగా ‘ఐ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ ఫిలింస్ అధినేత వి.రవిచంద్రన్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ విజువల్ వండర్‌ను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైలిమిటెడ్ సంస్థ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చియాన్ విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈచిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.