For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాక్: దాసరి కోసం పవన్ మళ్లీ మెగాఫోన్..సబ్జెక్టు అదే

  By Srikanya
  |

  హైదరాబాద్ : గతంలో పవన్ కళ్యాణ్ ...తన స్వీయ దర్శకత్వంలో జానీ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం పరాజయంతో ఆ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు. అయితే ఇప్పుడు మరోసారి స్వయంగా డైరక్షన్ కు పూనుకోనున్నట్లు తెలుస్తోంది. దాసరి నిర్మించే చిత్రం కోసం పవన్ తిరిగి డైరక్షన్ చేయనున్నారని చెప్పుకుంటున్నారు. అందుకోసం ఆయన గతంలో తాను వర్కవుట్ చేసిన సత్యాగ్రహి స్క్రిప్టుని తీసుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ప్రముఖ దర్శకరత్న దాసరి నారాయణరావు, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తారక ప్రభు ఫిలిమ్స్‌ పతాకంపై దాసరి నిర్మిస్తున్న 37వ సినిమాలో పవన్‌ నటించనున్నారు. ఇటీవల ఇద్దరూ కలిసిన సమయంలో తమ కాంబినేషన్‌లో సినిమా చేయాలని పవన్‌, దాసరి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే దాసరి నిర్మించనున్న సినిమాలో పవన్‌ నటిస్తున్నట్లు ఒక ప్రకటన వెలువడింది.

  అప్పట్లో 'సత్యాగ్రహి"అని చెప్పిన పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత ఆ పేరు తెరపైకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం 'సత్యాగ్రహి" చిత్రం ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాడట పవన్. ఈ చిత్రం దాసరి తారక ప్రభు ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతుందని, పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి దర్శకత్వం వ్యవహరిస్తాడని టాలీవుడ్ టాక్.

  SHOCKING: Pawan Kalyan to direct Satyagrahi for Dasari

  ప్రస్తుతం 'గబ్బర్ సింగ్ 2" చిత్రాన్ని రూపొందిస్తున్న పవన్, 'సత్యాగ్రహి" గ్రౌండ్ వర్క్ చేసి పట్టాలు ఎక్కించే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. మొదట ఎఎం రత్నం వారి శ్రీ సూర్య బ్యానర్ లో చిత్రీకరించాలని అనుకొన్నారు. అయితే అప్పుడు అనుకోని కారణాలతో ఆగిపోయింది.

  దర్శకరత్న దాసరి నారాయణరావు - పవన్‌ కల్యాణ్‌ కలసి ఓ సినిమా చేస్తున్నారనే అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అది రూమర్ అని కొట్టిపారేసే లోగా దానిని ఖరారు చేస్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ...దాసరి ఈ విషయాన్ని ఖరారు చేస్తూ పోస్ట్ చేసారు. నా నెక్ట్స్ డైరక్టోరియల్ ప్రాజెక్టు మన పవర్ స్టార్ అని రాసారు. ఇది అభిమానులలో కలకలం పుట్టించింది. దాసరి దర్శకత్వంలో పవన్ సినిమా ఏంటని తలలు పట్టుకున్నారు. అయితే ఈ విషయం గమనించినట్లున్నారు...మరి కాస్సేపటికి దాన్ని ఎడిట్ చేస్తూ...నా నెక్ట్స్ ప్రాజెక్టు పవర్ స్టార్ తో అని పోస్ట్ పెట్టి రిలీఫ్ ఇచ్చారు.

  త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు తెలుపుతారని సమాచారం. దీని పట్ల పవన్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఊహకందని విధంగా ఉంటున్నాయి.

  పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రానికి దాసరి నారాయణరావు నిర్మాతగా వ్యవహరించనున్నారు. తారకప్రభు ఫిలింస్‌ బ్యానర్‌పై దాసరి ఈ సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. తారకప్రభు ఫిలింస్‌ బ్యానర్‌పై 37వ చిత్రంగా పవన్‌కల్యాణ్‌ సినిమా రానుంది.

  ఇలా ఈ విషయాన్ని దాసరి ధ్రువీకరించారు కూడా. అయితే దర్శకుడెవరనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం 'గబ్బర్‌ సింగ్‌ 2' పనుల్లో బిజీగా ఉన్నారు పవన్‌. ఆ సినిమా పూర్తయ్యాకే దాసరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కాంబినేషన్‌ ఇది. మరి ఈ కలయిక ఇంకెన్ని షాక్‌లను ఇస్తుందో మరి అంటోంది మీడియా.

  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2′ పనుల్లో బిజీగా ఉన్నారు. శరత్ మరార్ ఈ సినిమాకు నిర్మాత. ‘గబ్బర్ సింగ్ 2′ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇటివలే ‘గోపాల గోపాల' దర్శకుడు డాలీ(కిషోర్) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు. దాసరి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందో.. అని చర్చ నడుస్తోంది.

  English summary
  Dasari Narayana Rao will be producing Pawan Kalyan's next project under his Tarakaprabhu banner. Few sources say that the actor may be himself wielding the megaphone once again for this project. Several years ago, Pawan Kalyan had started a film called 'Satyagrahi' in his own direction.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X