»   » సింహా చిత్రం కలెక్షన్ పూర్తి స్ధాయిలో డ్రాప్ !?

సింహా చిత్రం కలెక్షన్ పూర్తి స్ధాయిలో డ్రాప్ !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ కెరీర్ కి మళ్ళీ ఊపు తెచ్చిన సింహా చిత్రం కలెక్షన్స్ పూర్తి స్దాయిలో డ్రాప్ అయినట్లు వినిపిస్తోంది. మూడో వారానికి హైదరాబాద్ లోని కొన్ని ధియోటర్లలో మళ్ళీ వేయటం, కలెక్షన్స్ లేకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఎక్కువ సెంటర్లలలో వేయటం వల్ల ఒకే సారి మాగ్జిమమ్ చూసేయటం వల్ల ఇలా జరిగిందని కొందరు రీజన్ ఇస్తున్నారు. కానీ రిపీట్ ఆడియన్స్ లేకపోవటం ఈ చిత్రం కలెక్షన్స్ దెబ్బ కొట్టిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చిత్రంలో హింస ఫ్యామిలీలను దూరం పెట్టిందని, వారు కూడా వచ్చిందంటే పోకిరి రేంజిలో వర్కవుట్ అయిందని అంటున్నారు. దీనికి తోడు నిర్మాతలు మొదటి వారం ప్రకటించినట్లుగా కలెక్షన్ ఇరవై ఆరు కోట్లు కాదని పధ్నాలుగు కోట్ల యాభై లక్షలు అని మరో టాక్ బయిలుదేరింది. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ మధ్య కాలంలో బాలకృష్ణ ఏ చిత్రానికి రానటువంటి ఓపినింగ్స్, కలెక్షన్స్, హైప్ తెచ్చిన చిత్రం మాత్రం ఇదేనని మాత్రం ముక్త కంఠంతో అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu